మలయాళం సినిమాలకు ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్, హారర్ మూవీస్ జనాలకు తెగ నచ్చేస్తున్నాయి. ఊహించని ట్విస్టులు.. భయపెట్టే కథలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఓటీటీలో ఇతర భాషల చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ పైకి వస్తోన్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ఆంటోని’. జోజు జార్జ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటించింది. ఇందులో వీరిద్దరి కెమిస్ట్రీ సినీ ప్రియులను ఆకట్టుకుంది. గతేడాది డిసెంబర్ 1న కేరళలో రిలీజ్ అయ్యింది ఈ మూవీ. అక్కడ ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. దర్శకత్వంలో నటీనటుల యాక్టింగ్ పై విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి భారీ వసూళ్లు రాబట్టింది. ఇక సోషల్ మీడియాలో ఈ మూవీ సీన్స్ వైరలవడంతో ఈ చిత్రంపై క్యూరియాసిటి నెలకొంది. దీంతో ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేశారు. ఇక కాస్త ఆలస్యమైనా ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా తెలుగులో అందుబాటులో ఉంది.
అడియన్స్ ఎప్పుడెప్పుడా అని క్యూరియాసిటితో వెయిట్ చేస్తున్న ‘ఆంటోని’ సినిమా ఫిబ్రవరి 23 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇప్పుడు ఈ మూవీ గురించి నెట్టింట బాగానే చర్చలు జరుగుతున్నాయి. ఈ మూవీ కథ విషయానికి వస్తే.. తండ్రి కూతురు బాండింగ్ గురించి సాగుతుందని తెలుస్తోంది. రాజేష్ వర్మ అందించిన కథతో జోషి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
చాలా కాలం తర్వాత ఈ మూవీలో నటించింది కళ్యాణి ప్రియదర్శన్. అలాగే చెంబన్ వినోద్ జోస్, నైలా ఉష, ఆశా శరత్, అప్పని శరత్, విజయ రాఘవన్ వంటి వారు నటించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. ఇన్నాళ్లు మలయాళంలో అలరించిన ఈ సూపర్ హిట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని ఇప్పుడు నేరుగా తెలుగులోనే చూడొచ్చు.
Brace yourself, a ruthless Gangster has arrived!👉
Watch ‘#Antony‘ on aha ▶️https://t.co/Fz5Y4TrOQH pic.twitter.com/u2K7qqt4JD— ahavideoin (@ahavideoIN) February 23, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.