‘ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది’ అని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. ఈ మాటలను నిజం చేస్తూ ఇంట్లో గరిట తిప్పుతూనే గడప దాటి ఉద్యోగం చేస్తూ, వ్యాపారాలు చేస్తూ తన భర్తకు అండగా నిలిచే మహిళలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి మహిళా వ్యాపారవేత్తలకు ఒక మంచి అవకాశం కల్పించింది ‘ఆహా’. నేను సూపర్ ఉమెన్ అనే బిజినెస్ షో ద్వారా ఇలాంటి మహిళలకు అండగా నిలిచేందుకు సిద్ధమైంది. జులై 21 న ఈ షో ఆహ లో ప్రారంభమయింది. ‘నేను సూపర్ ఉమెన్’ గురించి చెప్పాలంటే ఇది మహిళల బిజినెస్ డ్రీమ్స్‌కి డోర్ బెల్ అన్నమాట. అంటే ఈ స్టేజ్ మీదకి మహిళలు వచ్చి వాళ్ల బిజినెస్ ఐడియాలను ప్రెజెంట్ చేస్తారు. వాళ్ల ఐడియాలను ఎంకరేజ్ చేస్తూ వాళ్ల బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేయడానికి కొంతమంది ఏంజెల్స్ కూడా ఉంటారు. అయితే ఈ ఆహా షోలో ఏంజెల్స్ హేమాహేమీలే వచ్చారు. సింధూర నారాయణ (నారాయణ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్), శ్రీధర్ గాధి (క్వాంటెలా ఐఎన్‌సీ ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్), దీప దొడ్ల (దొడ్ల డెయిరీ ప్రమోటర్), సుధాకర్ రెడ్డి (అభి బస్ ఫౌండర్, ఫ్రెష్ బస్- ఫౌండర్, సీఈఓ), రేణుక బొడ్ల (సిల్వర్ నీడిల్ వెంచర్స్- వెంచర్ పార్ట్‌నర్), రోహిత్ చెన్నమనేని (డార్విన్ బాక్స్ కో-ఫౌండర్), కరణ్ బజాజ్ (ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా).
ప్రతిమ విశ్వనాధ్ – అమ్మమ్మ
అమ్మమ్మ బ్రాండ్ కింద ప్రతిమ అదిరే బిజినెస్ నడిపిస్తున్నారు. ఇది ఎఫ్‌ఎంసీజీ కంపెనీ అని చెపుకోవచ్చు. 2019 ఏప్రిల్‌లో ఈమె తన భర్త,ఇద్దురు ఉద్యోగులకు ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు 100 మంది ఉద్యోగులతో వ్యాపారం నడిపిస్తున్నారు. 1000 స్టోర్లలో వీరి ప్రొడక్టులు అందుబాటులో ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో 20 పట్టణాల్లో సేవలు అందిస్తున్నారు. తొలి ఏడాది ఆరు నెలల్లో రూ.18 లక్షలు బిజినెస్ చేశారు. ఈ బిజినెస్ రెండేళ్లలో రూ.1.5 కోట్లకు, మూడేళ్లలో రూ.2.75 కోట్లకు, నాలుగేళ్లలో రూ.2.45 కోట్లకు చేరింది. ఆవిడా 3 కోట్లు 6 % ఈక్విటీ కి అడిగారు. అయితే, సుధాకర్ రెడ్డి దీప దొడ్ల 50 లక్షలు 2 % ఈక్విటీ కి ఇన్వెస్ట్ చేసారు.
Chutneys Angels tho launch cheyinchi 3 kotlu funding adigina ‘Ammama’😉#NenuSuperWoman Streaming now only on Aha !!! 🤩 ▶️ https://t.co/FgNfrIZV4W
Everyday Fri & Sat @ 7pm. @renukabodla @sridhargadhi #sindhuranarayana @sudhakar_chirra @chennamaneni #deepadodla @Sreeram_singer pic.twitter.com/2Q2bBhirLP— ahavideoin (@ahavideoIN) July 24, 2023
పావని – వాప్రా
ఈమె వాప్రా బ్రాండ్ కింద కంపోస్ట్ బిజినెస్ నిర్వహిస్తున్నారు. ఇది కొత్త బిజినెస్ ఐడియా అని చెప్పుకోవచ్చు. ఇంట్లో చెత్తను చాలా ఈజీగా కంపోస్ట్ చేసే కంపోస్టర్ ప్రొడక్టలను వీరు తయారు చేస్తున్నారు. ఈ ప్రొడక్టులతో ఇంట్లోనే చెత్తను రీసైకిల్ చేసి కంపోస్ట్ చేయొచ్చు. 2020లో కంపెనీ లాంచ్ చేశారు. రోజుకు ఒక్క రూపాయితోనే ఇంట్లో చెత్తను రీసైకిల్ చేసుకోవచ్చు. 7 రోజుల్లో కంపోస్ట్ తయారు అవుతుంది. ఇప్పుడు పావని తన బిజినెస్‌ను మరింత విస్తరించాలని చూస్తున్నారు. అందుకే నిధుల కోసం నేను సూపర్ ఉమెన్ కు వచ్చారు. ఈమె రెండు కంపోస్ట్ ప్లాంట్ల ఏర్పాటు కోసం రూ. 25 లక్షలు కోరారు. అయితే, సింధూర నారాయణ మరియు సుధాకర్ రెడ్డి కలిసి 25 లక్షలు 20 % ఈక్విటీ కి ఇన్వెస్ట్ చేసారు.
నీలిమ – కోకో టాంగ్
కోకో ట్యాంగ్ బ్రాండ్ ద్వారా ఎంట్రప్రెన్యూర్ నీలిమా బిజినెస్ నిర్వహిస్తున్నారు. ఈమె కొబ్బరి నీళ్లతో కొత్త డ్రింక్స్‌ను తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తారు. వెండింగ్ మెషీన్ ద్వారా నేరుగా కస్టమర్లకు ప్రొడక్టులకు అందుబాటులో ఉంచారు. సీతా ఫలం, సపోట, మామిడి ఇలా వివిధ ఫ్లేవర్స్‌లో మీకు ఈ కొబ్బరి నీళ్లు లభిస్తున్నాయి. ఈ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఈమె ఫండింగ్ కోసం సూపర్ ఉమెన్ ప్రోగ్రామ్‌లో పాల్గొననున్నారు. రూ. 50 లక్షలు పొందాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. అయితే, ఈమెకు ఏంజెల్స్ యొక్క సపోర్ట్ దకింది. దీప దొడ్ల ఇంకను సుధాకర్ రెడ్డి వారి వారి కస్టమర్స్ కి ఈ డ్రింక్ ఇవ్వనున్నారు. అది వారికీ నచ్చితే, నీలిమ తోటి బిజినెస్ చేయనున్నారు.
Happy faces 😊
&
Exciting moments 😄An event of Nenu Super Woman’ special screening at Narayana Educational institutions..!💁♀️#NenuSuperWoman Streaming now only on Aha !!! 🤩
Everyday Fri & Sat @7pm @rsbrothersindia @ShaadiDotCom @continentalkofi @tnldoublehorse… pic.twitter.com/gT85OwzV3N— ahavideoin (@ahavideoIN) July 23, 2023
శ్రీదేవి – జితారా
ఈమె జితారా కంపెనీని నిర్వహిస్తున్నారు. ఇది రిటైల్ సర్వీసెస్ సంస్థ. యూపీఐ క్యూఆర్ కోడ్, కస్టమర్ రిలేషన్ మేనేజ్‌మెంట్, కస్టమర్ డేటా మేనేజ్‌మెంట్ సహా పలు రకాల సర్వీసులు అందిస్తూ వస్తోంది. భారత దేశం లోనే మొట్ట మొదటి యూపీఐ కస్టమర్ ఎంగేజ్మెంట్ ప్లాట్ఫారం. ఇలా ఈమె తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలని చూస్తున్నారు. ఎక్కువ మంది రిటైలర్లకు చేరువ కావాలని భావిస్తున్నారు. అందుకే నిధులు పొందాలని నేను సూపర్ ఉమెన్ షోలో పాల్గొననున్నారు. రూ. 80 లక్షలు ఫండింగ్ పొందాలని టార్గెట్‌గా నిర్దేశించుకున్నారు. శ్రీదేవి యొక్క ఆత్మవిశ్వానికి ఏంజెల్స్ అందరు కలిసి ఇన్వెస్ట్ చేసారు. ఇది ఒక మెగా డీల్. అందరు ఏంజెల్స్ కలిసి 60 లక్షలు 6 % ఈక్విటీ కి ఇన్వెస్ట్ చేసారు
what a ‘compose’d Business idea👏..!
Don’t ‘waste” your time
Watch this Nenu Super Woman Show immediately 💁♀#NenuSuperWoman Streaming now only on Aha !!! ▶ https://t.co/UbVpXyIZ6Q@renukabodla @sridhargadhi @sudhakar_chirra @chennamaneni #deepadodla @Sreeram_singer pic.twitter.com/39OT9krgfU— ahavideoin (@ahavideoIN) July 23, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.