Unstoppable With NBK 2: అవార్డుల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన అలనాటి తారలు.. ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదంటూ..

|

Dec 24, 2022 | 9:14 PM

ఇటీవల అలనాటి తారలు జయసుద... జయప్రదలతో కలిసి ఈతరం హీరోయిన్ రాశీ ఖన్నా బాలయ్యతో కలిసి సందడి చేశారు. వీరి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోకు మంచి స్పందన లభించింది. ఇక సీనియర్ హీరోయిన్స్ జయప్రద, జయసుధలతో సరదాగా మాట్లాడుతూనే.. అవార్డుల విషయం తీసుకోచ్చారు బాలయ్య.

Unstoppable With NBK 2: అవార్డుల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన అలనాటి తారలు.. ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదంటూ..
Unstoppable With Nbk 2
Follow us on

ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. తనదైనా సరదా మాటలతో.. ప్రేక్షకులు అడగాలనుకుంటున్న ప్రశ్నలను సెలబ్రెటీల ముందుకు తీసుకువస్తూ. సమాధానాలు రాబడుతున్నారు బాలయ్య. ప్రశ్నల్లో మరింత ఫైర్.. ఆటల్లో మరింత డేర్ అంటూ సీజన్ 2 స్టార్ట్ చేసిన బాలయ్య.. ఇక ఆ మాటకు తగినట్టుగానే ఈ సీజన్ నడిపిస్తున్నారు. ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు.. మాజీ ముఖ్యమంత్రి, అల్లు అరవింద్, సురేష్ బాబు, విశ్వక్ సేన్, శర్వానంద్, అడివిశేష్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, గోపిచంద్ వచ్చి సందడి చేయగా.. ఇటీవల అలనాటి తారలు జయసుద… జయప్రదలతో కలిసి ఈతరం హీరోయిన్ రాశీ ఖన్నా బాలయ్యతో కలిసి సందడి చేశారు. వీరి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోకు మంచి స్పందన లభించింది. ఇక సీనియర్ హీరోయిన్స్ జయప్రద, జయసుధలతో సరదాగా మాట్లాడుతూనే.. అవార్డుల విషయం తీసుకోచ్చారు బాలయ్య. ఎన్నో దశాబ్ధాలుగా తెలుగువారికి పద్మ పురస్కారాల్లో అన్యాయం జరుగుతుందనే వాదన తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఇక ఇటీవల విడుదలైన అవార్డులలో తెలుగు వారికి దక్కినవి అత్యల్పం మాత్రమే. ఇక ఇదే ప్రశ్నను అడిగారు బాలయ్య.

సహజ నటిగా పేరున్న మీకు ఇప్పటివరకూ ఒక్క కేంద్ర పురస్కారం కూడా రాలేదు. కారణం ఏంటీ ? అని అడిగారు బాలయ్య. ఇందుకు ఆమె స్పందిస్తూ.. “కంగనా రనౌత్‌కు పద్మశ్రీ ఇవ్వడం పట్ల మేము తప్పుబట్టడం లేదు.. ఆమె అద్భుతమైన నటి. ఆమె కేవలం 10 చిత్రాలలోపు ఆ అవార్డును అందుకుంది. కానీ సీనియర్లను పక్కనపెట్టి.. అంత చిన్న వయసులోనే పద్మ పురస్కారం అందుకుంది. ఇక్కడ, మేము అనేక చిత్రాల్లో నటించాము. కానీ మమ్మల్ని ఇంకా ప్రభుత్వం గుర్తించలేదు.” అంటూ చెప్పుకొచ్చారు.

ఇక జయసుధ మాటలకు జయప్రద స్పందిస్తూ.. “మనం గౌరవంగా పొందాలి. అంతేకానీ అడగడం ద్వారా రావడం కాదు.” అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు. ఇక జయసుధ మాట్లాడుతూ.. ‘గిన్నిస్‌ రికార్డుల్లో చోటు దక్కించుకున్న మహిళా దర్శకురాలు విజయనిర్మలను మర్చిపోతున్నారు. ఎన్నో సినిమాలు చేసినా.. మమ్మల్ని.. దక్షిణాదిని ప్రభుత్వం గుర్తించకపోవడం ఒక్కోసారి బాధగా అనిపిస్తుంది.” అని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.