AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jailer 2: రజనీకాంత్ జైలర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటివరకు దాదాపు 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రానికి రోజు రోజుకీ మరింత రెస్పాన్స్ వస్తుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ గురించి చర్చ నడుస్తుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. అంతేకాదు సుమారు రూ. 160 కోట్ల భారీ డిజిటల్ డీల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో దూసుకుపోతూ ఓటీటీలోనూ సందడి చేయడానికి సిద్ధమవుతోంది.

Jailer 2: రజనీకాంత్ జైలర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Jailer 2
Rajitha Chanti
|

Updated on: Oct 26, 2026 | 7:02 PM

Share

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సెన్సేషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జైలర్’. అప్పట్లో ఈ మూవీ థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. థియేటర్లలో రజనీ మాస్ యాక్షన్, పవర్‌ఫుల్ డైలాగ్స్ తో అభిమానులు సందడి చేస్తుండగా, ఈ సినిమా ఓటీటీ విడుదలపై సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ డేట్, రికార్డు స్థాయి ఓటీటీ డీల్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ‘జైలర్ 2’ సినిమా నవంబర్ 12, 2026 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..

తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ కానుందని సమాచారం. థియేటర్లలో సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు త్వరలోనే తమ ఇంట్లోనే ఈ యాక్షన్ విజువల్ ట్రీట్‌ను ఆస్వాదించవచ్చని భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తాన్ని వెచ్చించినట్లు తెలుస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : Brahmanandam: వాళ్లు ఏదో అనుకుంటారని ఆగకు.. జీవితంపై బ్రహ్మానందం చెప్పిన అద్భుతమైన మాటలు..

సుమారు రూ. 160 కోట్లతో ఈ ఓటీటీ డీల్ కుదిరినట్లు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. ఒక సౌత్ ఇండియన్ సినిమాకు ఈ స్థాయిలో డిజిటల్ రైట్స్ ధర పలకడం విశేషం. బాక్సాఫీస్ వద్ద కూడా ఇప్పటికే రూ. 710 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డులు సృష్టిస్తున్న ఈ చిత్రం, ఓటీటీ మార్కెట్‌లోనూ సంచలనాలు సృష్టిస్తోంది. త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక రిలీజ్ డేట్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది.

ఎక్కువ మంది చదివినవి : Kodi Ramakrishna: ఒక్క ఏడాదిలోనే 23 సినిమాలు చేసిన ఏకైక హీరో.. దాసరి గారు ఒక మాట అన్నారు.. డైరెక్టర్ కోడి రామకృష్ణ..

జైలర్ 2 స్ట్రీమింగ్ డేట్..

ఎక్కువ మంది చదివినవి : SV Krishna Reddy: ఆమె అద్భుతమైన హీరోయిన్.. మధ్యతరగతి పాత్రలకు సరిగ్గా సెట్ అవుతుంది.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..

Follow Us