Ramam Raghavam OTT: అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి జబర్దస్త్ ధన్‌రాజ్ రామం రాఘవం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

జబర్దస్త్ ఫేమ్, స్టార్ కమెడియన్ ధన్ రాజ్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన చిత్రం రామం రాఘవం. తండ్రీ కొడుకుల సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ ఎమోషనల్ డ్రామాలో ధనరాజ్ తో పాటు నటుడు, దర్శకుడు సముద్రఖని కీలక పాత్ర పోషించారు.

Ramam Raghavam OTT: అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి జబర్దస్త్ ధన్‌రాజ్ రామం రాఘవం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Ramam Raghavam Movie

Updated on: Mar 03, 2025 | 10:45 PM

బలగం వేణు తరహాలోనే ఇటీవల డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు జబర్దస్త్ ఫేమ్ ధన్ రాజ్. రామం రాఘవం పేరుతో ఓ ఎమోషనల్ సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఇందులో ధన్‌రాజ్ తో పాటు ప్రముఖ దర్శకుడు, నటుడు సముద్ర ఖని మరో కీలక పాత్ర పోషించడంతో రామం రాఘవంపై మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ కు కూడా మంచి స్పందన వచ్చింది. అంచనాలకు తగ్గట్టుగానే ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైన రామం రాఘవం కు పాజిటివ్ రెస్పాన్స్ నే వచ్చింది. బలగం తరహాలో కాకపోయినా కథ, టేకింగ్ పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ధన్‌రాజ్ డైరెక్షన్ కు కూడా మంచి మార్కులే పడ్డాయి. అయితే పేరున్న నటీనటులు లేకపోవడంతో ఈ సినిమా లాంగ్ రన్ లో కలెక్షన్లు రాబట్టలేపోయింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. తాజాగా రామం రాఘవం సినిమాపై కీ అప్డేట్ ఇచ్చింది. ఖచ్చితమైన డేట్ చెప్పకపోయినా త్వరలోనే ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో సినిమా పోస్టర్ ను కూడా షేర్ చేసింది.

ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై పృథ్వి పోలవరపు రామం రాఘవం సినిమాను నిర్మించారు.సునీల్ , మోక్ష సేన్‌గుప్తా, హరీష్ ఉత్తమన్, వెన్నెల కిషోర్, సత్య, పృథ్వీ రాజ్, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి, చిత్రం శ్రీను, రచ్చ రవి,ఇంటూరి వాసు, రాకెట్ రాఘవ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అరుణ్ చిలువేరు సంగీతం అందించారు. శివ ప్రసాద్ యానాల కథ అందించగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలను దుర్గా ప్రసాద్ కొల్లి నిర్వర్తించారు.

ఇవి కూడా చదవండి

 

ఇక సినిమా కథ విషయానికి వస్తే.. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. కన్న తండ్రినే కొడుకు హత్య చేయాలనేకునేలా దారి తీసిన పరిస్థితులేంటి? అన్నది ఈ సినిమా కథాంశం.

ఈటీవీ విన్ లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.