రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించిన స్కంద సినిమా ఓటీటీ రిలీజ్‌పై కొనసాగుతోన్న సస్పెన్స్‌కు తెరపడింది. బోయపాటి శీను తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుంది. దీనిపై ఓటీటీ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. స్కంద సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదట అక్టోబర్ 27నే రామ్ సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా స్కంద ఓటీటీ రిలీజ్ డేట్ వాయిదా పడింది. అయితే ఇప్పుడు అధికారికంగా రామ్ సినిమా డిజిటల్ రిలీజ్ డేట్ వచ్చేసింది. నవంబర్ 2 నుంచి స్కంద సినిమాను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రకటించింది. ‘యాక్షన్ అడ్వెంచర్‌లోకి తీసుకెళ్లేందుకు స్కంద వచ్చేస్తోంది. నవంబర్ 2వ తేదీ నుంచి ర్యాపో ర్యాంపేజ్ హాట్‍స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది’ అని ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా సెప్టెంబర్ 28న థియేటర్లలో రిలీజైన స్కంద సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఓవరాల్‌గా బాక్సాఫీస్ రూ. 50 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది.
స్కంద సినిమాలో రామ్ డబుల్ రోల్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు యూత్ ఫుల్ అండ్ లవ్ స్టోరీల్లోనే ఎక్కువగా నటించిన ఉస్తాద్ స్కంద సినిమాలో మొదటిసారి ఊర మాస్ హీరోగా కనిపించాడు. శ్రీలీలతో పాటు బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ సెకెండ్ హీరోయిన్‌గా నటించింది. అలాగే శ్రీకాంత్, ప్రిన్స్, శరత్ లోహితస్వ, దగ్గుబాటి రాజా, ప్రభాకర్, గౌతమి, ఇంద్రజ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే బాలీవుడ్ సెన్సేషన్ ఊర్వశి రౌతెలా ఓ స్పెషల్ సాంగ్‌లో సందడి చేసింది. సిల్వర్ స్క్రీన్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై శ్రీనివాస్ చిట్టూరి, పవన్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన స్కంద సినిమాకు ఎస్. థమన్ స్వరాలు అందించారు. మరి థియేటర్లలో రామ్ స్కంద సినిమాను మిస్ అయ్యారా? ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
Hold on tight as #Skanda is coming to take you on a wild action adventure! #RaPoRampageonHotstar will be streaming from 2nd Nov!#DisneyPlusHotstar@ramsayz @sreeleela14 #BoyapatiSreenu @saieemmanjrekar @MusicThaman @srinivasaaoffl @SS_Screens @SantoshDetake @StunShiva8… pic.twitter.com/bwXrwu8zPS
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) October 27, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..