OTT Platform: స్వాతంత్య్రదినోత్సవ కానుకగాఈ వారం థియేటర్‌లో ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు ఇవే..

OTT Platform: కరోనా సమయంలో లాక్ డౌన్ విధినప్పటి నుంచి ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సినిమాలను రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాతలు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇప్పటికే చిన్న పెద్ద సినిమాలు..

OTT Platform: స్వాతంత్య్రదినోత్సవ కానుకగాఈ వారం థియేటర్‌లో ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు ఇవే..
Ott Movies

Updated on: Sep 09, 2021 | 6:56 PM

OTT Platform: కరోనా సమయంలో లాక్ డౌన్ విధినప్పటి నుంచి ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సినిమాలను రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాతలు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇప్పటికే చిన్న పెద్ద సినిమాలు ఓటీటీల్లో పలు సినిమాలు సందడి చేశాయి. తాజాగా స్వాతంత్య దినోత్సవాన్ని పురష్కరించుకుని థియేటర్స్ లో , ఓటిటిలో విడుదల కానున్న సినిమాల వివరాల్లోకి వెళ్తే..

నటుడు సునీల్‌ హీరోగా తెరెకెక్కిన క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘కనబడుటలేదు’. ఈ సినిమా ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సునీల్‌ డిటెక్టివ్‌గా కనిపించనున్నారు. డిటెక్టివ్‌గా సునీల్‌ నటన ఎలా ఉందో తెలియాలంటే ఆగష్టు 19 వరకూ ఆగాల్సిందే.

యంగ్ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘రాజ రాజ చోర’ సినిమా కూడా ఆగష్టు 19న రిలీజ్ కానుంది. హసిత్‌ గోలి దర్శకత్వం వహించిన ఈ సినిమా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చెప్పుకునే ఓ దొంగ కథతో తెరకెక్కింది. శ్రీ విష్ణు సరసన మేఘా ఆకాశ్‌, సునయన నటించారు.

స్వీటీ అమ్మాయిగా శ్రీముఖి నటించిన ‘క్రేజీ అంకుల్స్‌’ కూడా ఆగష్టు 19న థియేటర్స్ లో సందడి చేయనుంది. ఓ అపార్టుమెంటులో ఉండే మధ్య వయస్కులైన ఆర్‌,ఆర్‌,ఆర్‌ (రాజు.. రెడ్డి.. రావు) ముగ్గురూ .. తాము కుర్రతనంలో చేయలేకపోయిన చిలిపి పనులు ఇప్పుడు చేద్దామని అనుకుంటారు. . ఈ క్రమంలోనే ఒక అందమైన అమ్మాయి స్వీటీ (శ్రీముఖి) వెంట పడి ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేది కథ.

ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ తొమ్మిది సిరీస్ ఆగష్టు 19 ఇంగ్లీష్‌, హిందీతో పాటు, ఇతర భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది.

‘హృదయకాలేయం’, ‘కొబ్బరిమట్ట’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ‘బజార్‌ రౌడీ’ ఆగస్టు 20న రిలీజ్ కానుంది. మాస్‌ తరహా సన్నివేశాలతో వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో మహేశ్వరి వద్ది నాయిక హీరోయిన్ .

ఇక ఓటీటీలో విడుదల కానున్న చిత్రాలు ఆహా లో ఆగస్టు 20 తరగతి గది దాటి రిలీజ్ కానుంది. అమెజాన్‌ ప్రైమ్‌ లో

ఆగస్టు 16 న ఇవాన్‌ అల్మైటీ , ఆగష్టు 17న ద స్కెలిటన్‌ ట్విన్స్‌ , ఆగష్టు 18న నైన్‌ పర్‌ఫెక్ట్‌ స్ట్రేంజర్స్‌ , ఆగస్టు 19న హోమ్‌ , ఆగష్ట్ 20న అన్నెట్టే , కిల్లర్‌ ఎమాంగ్‌ అజ్‌ విడుదల కానున్నాయి. మరోవైపు నెట్‌ఫ్లిక్స్‌ లో ఆగష్ట్ 20న కామెడీ ప్రీమియం లీగ్‌ కామెడీ షో, 21న స్వీట్‌గర్ల్‌ సందడి చేయనున్నాయి.మరోవైపు జీ 5 లో కూడా ఆగస్టు 20న 200 హల్లా హో, ఆల్ట్‌ బాలాజీ , కార్టెల్‌ లు రిలీజ్ కానున్నాయి.

Also Read: Independence Day: టైమ్స్ స్క్వేర్‌లో ఇండిపెండ్స్ డే సెలబ్రేషన్స్.. భారీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రవాసాంధ్రులు