OTT Movie: థియేటర్లలో ఆడియెన్స్‌ను భయపెట్టిన సినిమా.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్

దొంగ బాబాలు, స్వామిజీల ఆగడాలు, ఆత్మలు, దెయ్యాల నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ సినిమా సాగుతుంది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. థియేటర్లలో ఆడియెన్స్ ను బాగానే భయపెట్టింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

OTT Movie: థియేటర్లలో ఆడియెన్స్‌ను భయపెట్టిన సినిమా.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్
OTT Movie

Updated on: Jul 15, 2026 | 9:52 PM

OTT ప్లాట్‌ఫామ్స్ లో ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తుంటాయి. ఈవారం కూడా సమంత మా ఇంటి బంగారం, ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు వంటి తెలుగు సినిమాలతో పాటు కొన్ని డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. వీటి మధ్యలో ఒక తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా సడెన్ గా స్ట్రీమింగ్ కు వచ్చింది. గతేడాది క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆడియెన్స్ ను బాగా భయపెట్టింది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఒళ్లు గగుర్పొడిచే సీన్లు, ఊహించని ట్విస్టులతో ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించింది. అలాగే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను కూడా రాబట్టింది. ఐఎఎమ్ డీబీలోనూ ఈ మూవీకి మంచి రేటింగ్ ఉండడం విశేషం. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు ఆడియెన్స్ ను మతి పోగొడుతాయి. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కల్యాణ్, నయన, అపర్ణ, వినయ్ చిన్నప్పటి నుంచి మంచి మంచి స్నేహితులు. దెయ్యాలు, ఆత్మలు లేవని బలంగా నమ్ముతారు. వీరంతా ఓ బృందంగా ఏర్పడి దొంగ బాబాలు, స్వామిజీల ఆగడాలు, బండారాల్ని బయటపెడుతుంటారు. అలా ఓసారి ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉంటున్న ఆదిదేవ్ (బబ్లూ పృథ్వీరాజ్) బాబా గురించి తెలుసుకుంటారు. బాబా నిజ స్వరూపం బయట పెట్టాలని అతని దగ్గరకు వెళతారు. అయితే ఆత్మలు, దెయ్యాల విషయంలో ఈ నలుగురికి ఓ ఛాలెంజ్ చేస్తాడు బాబా. దీని ప్రకారం ఈ నలుగురు ఒక భయంకరమైన పాడుబడిన బంగ్లాలో మూడు రోజుల పాటు నివసించడానికి రెడీ అవుతారు. మరి ఆ పాడుబడ్డ బంగ్లాలో వారికి ఎదురైన పరిస్థితులు ఏమిటి? పుణ్యవతి అనే ఆత్మకు, గిరిజనుడైన మైమ్ మధుకు ఉన్న సంబంధం ఏమిటి? చివరకు ఆ మిత్రులు ఆత్మలు, దెయ్యాలు ఉన్నాయని నమ్మరా? లేదా? అన్నప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ హారర్ థ్రిల్లర్ సినిమా చూడాల్సిందే.

2025లో విడుదలైన తెలుగు హారర్ థ్రిల్లర్ చిత్రం ఇషా. ఇందులో త్రిగున్, హెబ్బా పటేల్, అఖిల్ రాజ్, సిరి హమ్మంత్, బబ్లూ పృథ్వీరాజ్, మైమ్ మధు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ ఏడాది ప్రారంభంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చేసింది. అయితే బుధవారం (జులై 15) నుంచి మరో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లోకి కూడా ఇషా సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. శ్రీనివాస్ మన్నె ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఎల్ దామోదర్ ప్రసాద్ సమర్పణలో పోతుల హేమ వెంకటేశ్వరరావు ఈ సినిమాను నిర్మించారు. ఓటీటీలో మంచి హారర్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారికి ఇషా ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

ఇషా సినిమా ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us