AHA OTT: ఆహాలో మరో ఇంట్రెస్టింగ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌.. శింబు, హన్సికల ‘మహా’ స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

Maha Movie: ఆసక్తికరమైన కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకులకు సరిపడా వినోదాన్ని అందిస్తోంది ఆహా ఓటీటీ (AHA OTT). ఆకట్టుకునే సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో పాటు ఇతర భాషల్లో విడుదలై సూపర్‌హిట్ సాధించిన సినిమాలను తెలుగులోకి డబ్‌ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

AHA OTT: ఆహాలో మరో ఇంట్రెస్టింగ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌.. శింబు, హన్సికల మహా స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?
Maha Movie

Updated on: Sep 09, 2022 | 2:44 PM

Maha Movie: ఆసక్తికరమైన కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకులకు సరిపడా వినోదాన్ని అందిస్తోంది ఆహా ఓటీటీ (AHA OTT). ఆకట్టుకునే సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో పాటు ఇతర భాషల్లో విడుదలై సూపర్‌హిట్ సాధించిన సినిమాలను తెలుగులోకి డబ్‌ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలా తాజాగా మరో క్రైమ్‌ థ్రిల్లర్‌ను ఓటీటీ ఆడియెన్స్‌కు అందించేందుకు సిద్ధమైంది. యాపిల్‌ బ్యూటీ హన్సిక (Hansika) మెయిన్‌ లీడ్‌ లో నటించిన చిత్రం మహ. తమిళ సూపర్‌స్టార్‌ శింబు (Simbu) శ్రీకాంత్‌ కీలక పాత్రలు పోషించారు. జులై 22న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. కంటికి రెప్పలా కాపాడుకుంటోన్న కూతురును అపహరిస్తే, తల్లిగా హీరోయిన్‌ ఏం చేసింది? ఆపాప కిడ్నాప్‌ వెనక మిస్టరీ ఏంటి? అనే ఆసక్తికరమైన కథతో ఈ చిత్రం రూపొందింది. హన్సిక కెరీర్‌లో ఇది 50వ సినిమా కావడం విశేషం.

జమీల్‌ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ డిజిటల్‌ స్ర్కీన్‌పై అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో సెప్టెంబర్‌ 10 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని ఆహా యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు జిబ్రాన్‌ స్వరాలు అందించారు. మరి ఆసక్తికరమైన కథనంతో పాటు ఆద్యంతం ట్విస్టులతో కూడుకున్న మహా సినిమాను ఎంచెక్కా ఇంట్లో కూర్చొని ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..