Kalvan OTT: ఓటీటీలోకి వచ్చేసిన జీవీ ప్రకాశ్‌ కుమార్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులో కూడా చూడొచ్చు.. ఎక్కడంటే?

|

May 14, 2024 | 8:22 PM

ఓ వైపు సంగీత దర్శకుడిగా సత్తా చాటుతూనే.. మరో వైపు హీరోగా మంచి పేరు సంపాదించుకుంటున్నాడు జీవీ ప్రకాశ్ కుమార్. అతను హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా కల్వన్. తెలుగులో చోరుడుగా నామకరణం చేశారు. లవ్ టుడే ఫేమ్ ఇవానా హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్వన్ మూవీ యావరేజ్ గా నిలిచింది.

Kalvan OTT: ఓటీటీలోకి వచ్చేసిన జీవీ ప్రకాశ్‌ కుమార్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులో కూడా చూడొచ్చు.. ఎక్కడంటే?
Kalvan Movie
Follow us on

ఓ వైపు సంగీత దర్శకుడిగా సత్తా చాటుతూనే.. మరో వైపు హీరోగా మంచి పేరు సంపాదించుకుంటున్నాడు జీవీ ప్రకాశ్ కుమార్. అతను హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా కల్వన్. తెలుగులో చోరుడుగా నామకరణం చేశారు. లవ్ టుడే ఫేమ్ ఇవానా హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్వన్ మూవీ యావరేజ్ గా నిలిచింది. తమిళంలో ఓ మోస్తరు వసూళ్లను సాధించింది. అయితే కొన్ని కారణాలతో తెలుగులో రిలీజ్ చేయలేకపోయారు మేకర్స్. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సర్వైవల్ థ్రిల్లర్ గా రూపొందిన కల్వన్ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ జీవీ ప్రకాశ్ కుమార్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం (మే 14) అర్ధ రాత్రి నుంచి కల్వన్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లోనూ ఈ మూవీ సినిమా అందుబాటులో ఉంది.

కల్వన్ సినిమాకు పీవీ శంకర్ దర్శకత్వం వహించారు. ఎక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ఢిల్లీ బాబు నిర్మించిన ఈ సినిమాలో భారతీరాజా, ధీన, జ్ఞానసంబంధం, చేరన్ రాజ్, వినోద్ మున్నా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు సంగీతం కూడా అందించాడు జీవీ ప్రకాశ్ కుమార్. రేవా బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ సమకూర్చారు. ఇక కల్వన్ సినిమా కథ విషయానికి వస్తే.. ఓ ఏనుగును బంధించేందుకు నలుగురు ప్రయత్నిస్తారు. అందులో ఒకరు ఓ అమ్మాయితో ప్రేమలో పడతారు. మరి ఈ ప్రేమ పెళ్లి దాకా చేరిందా? ఏనుగును బంధించే క్రమంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయన్నది తెలుసుకోవాలంటే కల్వన్ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

కాగా థియేటర్లలో రిలీజైన సుమారు 40 రోజులకు కల్వన్ మూవీ డిస్నీ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. తమిళంతో పాటు మరో మూడు భాషల్లోనూ రావటంతో ఓటీటీలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశముంది. ఇటీవల థియేటర్లలో ప్లాఫ్ గా నిలిచిన సినిమాలు కూడా ఓటీటీలో రికార్డు వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. మరి కల్వన్ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.