కరోనా తర్వాత ఓటీటీల హవా బాగా పెరిగిపోయింది. ఓవైపు థియేటర్లలో సినిమాలు విడుదలవుతున్నప్పటికీ వీటి క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఆకట్టుకునే కంటెంట్‌తో ప్రతివారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాయి. మరోవైపు థియేటర్లలో విడుదలైన సినిమాలను కూడా నెలరోజుల్లోపే విడుదల చేస్తున్నాయి. అలా ఈ వారం థియేటర్లలో సూపర్ హిట్‌గా నిలిచి ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమా పొన్నియన్ సెల్వన్. మణిరత్నం డీమ్ ప్రాజెక్టుగా భావించిన ఈ సినిమాలో చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ తదితరలు కీలక పాత్రలు పోషించారు. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ విడుదలైన ఈ హిస్టారికల్ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. సుమారు రూ.400కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో పాటు సినీ ప్రియులను అలరించేందుకు మరికొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. మరి ఈ వీకెండ్‌లో చూడబుల్ సినిమాలు, సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం రండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఆహా
నెట్‌ఫ్లిక్స్
డిస్నీ హాట్‌స్టార్