8 ఏళ్లుగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సినిమా.. రూ.25 కోట్లు పెడితే రూ.180 కోట్లు వచ్చాయి.. ఇప్పటికీ ఓటీటీలో ట్రెండింగ్..

ఇప్పుడు వస్తున్న సినిమాలు ఓటీటీలను కూడా దృష్టిలో పెట్టుకోని తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఫ్లాప్ అయినా కూడా ఓటీటీల్లో విడుదలై సంచలన విజయాలను అందుకుంటున్నాయి. అలాగే కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీల్లో రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి.

8 ఏళ్లుగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సినిమా.. రూ.25 కోట్లు పెడితే రూ.180 కోట్లు వచ్చాయి.. ఇప్పటికీ ఓటీటీలో ట్రెండింగ్..
Ott Movie

Updated on: Sep 03, 2026 | 1:23 PM

కంటెంట్ ఆడియన్స్ కు కనెక్ట్ అయితే చాలు సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం.. చిన్న సినిమాలు కూడా భారీ హిట్స్ అందుకుంటున్నాయి. అలాగే కొన్ని సినిమాలు ఊహించని విధంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. తక్కువ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమాలు చాలా ఉన్నాయి. 2018 సంవత్సరంలో విడుదలైన ఒక సినిమా ఆడియన్స్ ను కట్టిపడేసింది. హారర్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఆ సినిమా ఇప్పటికీ ట్రెండింగ్ లోనే దూసుకుపోతుంది. ఇంతకూ ఆ హారర్ సినిమా ఎదో తెలుసా.? ఆ సినిమా స్త్రీ. ఆ సినిమాలో రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ లు ప్రధాన పాత్రలలో నటించారు. 2018లో విడుదలైన ఈ హర్రర్-కామెడీ చిత్రం ప్రజల హృదయాలను గెలుచుకుంది.

మరో హీరోయిన్ అయితే నావల్ల కాదు అని చేతులెత్తేసేది.. కానీ ఆమె అలా కాదు

ఈ సినిమా ప్రజలను భయపెట్టడమే కాకుండా కడుపుబ్బా నవ్వించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్త్రీ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ‘స్త్రీ’ సినిమా కథ విషయానికొస్తే.. మధ్యప్రదేశ్‌లోని చందేరి ఆధారంగా రూపొందించారు. ఆ గ్రామంలో ఒక స్త్రీ ఆత్మగా మారి తిరుగుతుందని.. ఆమెను ప్రజలు ‘స్త్రీ’ అని పిలుస్తారు. ఆమె ఎవరిని ఇబ్బందిపెట్టకుండా ఉండేందుకు ప్రజలు తమ ఇళ్ల గోడలపై ‘ఓ స్త్రీ రేపు రా’ అని రాసుకుంటారు. రాత్రి సమయంలో ఆ ఆత్మ ఊర్లో తిరుగుతుంటుంది. అయితే అది కేవలం పురుషులను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుంది.

నేను మాట్లాడిన మాట ప్రజల్లోకి వల్గర్‌గా వెళ్ళింది.. నా వల్ల ఆ స్టార్ డైరెక్టర్ మాటలు పడ్డారు..

ఆమె వారిని తీసుకెళ్లి బట్టలు లేకుండా ఓ జనావాసం లేని ఓ ప్రదేశంలో బంధిస్తుంది. అయితే ఆ ఆత్మను హీరో, హీరోయిన్ ఎలా బంధించారు. ఆ గ్రామ ప్రజలకు ఆత్మ నుంచి విముక్తి దొరికిందా లేదా అన్నది మనం సినిమాలోనే చూడాలి. ఈ చిత్రంలో చందేరి ప్రజలను స్త్రీ నుండి రక్షించే బాధ్యతను తీసుకునే విక్కీ పాత్రను రాజ్ కుమార్ రావు పోషించారు. హర్రర్ తో పాటు, కామెడీతో సాగుతుంది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సంచలనం సృష్టిస్తోంది. రూ.25 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.180 కోట్లు రాబట్టింది. ఇప్పటికీ ఓటీటీలో ట్రెండింగ్ లో ఉంది ఈ సినిమా.

ఇవి కూడా చదవండి

ఆ సినిమా ఫ్లాప్ అవుతుందనుకోలేదు.. ఆ దెబ్బకు 3 నెలలు ఇంట్లో నుంచి బయటకు రాలేదు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us