Dayaa OTT: డిజిటల్‌ బాట పట్టిన జేడీ.. ‘దయా’ క్రైమ్‌ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

|

Jul 26, 2023 | 8:01 AM

హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, డైరెక్టర్‌గా, సింగర్‌గా.. ఇలా మల్టీ ట్యాలెంట్‌తో టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు జేడీ చక్రవర్తి. గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు డిజిటల్‌ రంగంలోకి అడుగుపెట్టాడు.

Dayaa OTT: డిజిటల్‌ బాట పట్టిన జేడీ.. దయా క్రైమ్‌ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Dayaa Telugu Web Series
Follow us on

హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, డైరెక్టర్‌గా, సింగర్‌గా.. ఇలా మల్టీ ట్యాలెంట్‌తో టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు జేడీ చక్రవర్తి. గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు డిజిటల్‌ రంగంలోకి అడుగుపెట్టాడు. ‘దయా’ అనే వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ తెలుగు సిరీస్‌లో తెలుగమ్మాయి ఇషా రెబ్బ, స్టార్ యాంకర్‌ విష్ణుప్రియ, రమ్యనంబీసన్‌, జోష్‌ రవి, కమల్‌ కామరాజు కీలక పాత్రలు పోషించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ‘దయా’ ఆగస్టు 4 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. దయా సిరీస్‌లో జేడీ చక్రవర్తి వ్యాన్‌ డ్రైవర్‌గా నటించనున్నాడు. ఇటీవల ఈ సిరీస్‌ ట్రైలర్‌ రిలీజైంది. చూస్తుంటే ఇది పక్కా క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ అని ఇట్టే అర్థమవుతోంది. ఇటీవల ఓటీటీలో క్రైమ్‌, సస్పెన్స్‌, హారర్‌ థ్రిల్లర్‌లకు ఆదరణ బాగా పెరిగింది. సో.. కాబట్టి దయా సిరీస్‌పై కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు మేకర్స్‌.

 

ఇవి కూడా చదవండి

కాగా సావిత్రి, ప్రేమ ఇష్క్‌ కాదల్‌ సినిమాలతో ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు పవన్‌ సాధినేని. అలాగే రెండేళ్లక్రితం రాజేంద్రప్రసాద్‌తో తెరకెక్కించిన సేనాపతి సినిమా కూడా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇక పునర్నవి భూపాలంతో తెరకెక్కించిన కమిట్‌ మెంట్‌ వెబ్‌ సిరీస్‌ కూడా ఓటీటీ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఇదే క్రమంలో జేడీ చక్రవర్తితో కలిసి దయా అనే క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించారు పవన్‌. ట్రైలర్‌తో ఆసక్తిని రేకెత్తించిన దయా ఓటీటీ ఆడియెన్స్‌ను ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..