OTT Movies: భార్యకు వేరే అబ్బాయిలతో ఎఫైర్స్.. భర్త చేసిన పని మరింత భయంకరం.. ఓటీటీలో సంచలనం ఈ సినిమా..

ప్రస్తుతం ఓటీటీలో ఓ సినిమా సంచలనం సృష్టిస్తుంది. ఎరోటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు దూసుకుపోతుంది. భార్యకు ఇతర పురుషులతో ఎఫైర్స్ ఉండడంతో ఆ భర్త ఊహించని నిర్ణయం తీసుకుంటాడు. ఇక ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఈ చిత్రంలో ఒక్కో సీన్ భయంకరంగా ఉంటుంది. ఇంతకీ ఈ సినిమా పేరెంటో తెలుసా..?

OTT Movies: భార్యకు వేరే అబ్బాయిలతో ఎఫైర్స్.. భర్త చేసిన పని మరింత భయంకరం.. ఓటీటీలో సంచలనం ఈ సినిమా..
Deep Water Movie

Updated on: Jun 27, 2025 | 1:21 PM

ఓటీటీలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త జానర్ సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో దూసుకుపోతుంది. ఈ సినిమా మిమ్మల్ని భయపెడుతూనే ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ప్రేమ, ఉత్కంఠ, నేరాలను కలిపి నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమా పేరు ‘డీప్ వాటర్’. 2022లో విడుదలైన ఈ మూవీ సైకాలజీకల్ థ్రిల్లర్ డ్రామా. దర్శకుడు అడ్రియన్ లైన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్లు బెన్ అఫ్లెక్, అనా డి అర్మాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. మొదట్లో ఈ సినిమా విడుదల కోవిడ్-19 కారణంగా ఆలస్యం అయింది. దీంతో చివరకు నిర్మాతలు దీనిని ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రం మార్చి 18, 2022న హులు ఓటీటీలో ప్రీమియర్ అయింది.

అలాగే ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులో ఉంది. దీనిని ప్రేక్షకులు సులభంగా చూడవచ్చు. కథ విషయానికి వస్తే.. ఈ చిత్రంలోఇద్దరు విక్, మెలిండాల బంధం అనేక మలుపుల తిరుగుతుంది. మెలిండా తన భర్త ఉన్నప్పటికీ ఇతర వ్యక్తులతో ఎఫైర్స్ కొనసాగిస్తుంది. ఒకరోజు ఇద్దరు భార్యభర్తలు కలిసి ఒక పార్టీకి వెళతారు. అక్కడ మెలిండా జో అనే వ్యక్తితో చాలా సమయం గడుపుతుంది. ఇది చూసి అందరూ షాక్ అవుతారు కానీ విక్ మౌనంగా ఉంటాడు. ఆ తర్వాత విక్ జో దగ్గరికి వెళ్లి తన భార్య స్నేహితులను ఎలా చంపాడో చెబుతాడు. అతను జోను కూడా బెదిరిస్తాడు. ఆ తర్వాత విక్ జోను చంపేస్తాడు. అయినప్పటికీ తన భార్య మెలిండా ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాదు.

కొన్ని రోజులకు మెలిండా తన భర్తే ఈ హత్యలన్నీ చేస్తున్నాడని అనుమానిస్తుంది. కానీ ఇద్దరి మధ్య ప్రేమ తగ్గదు. చివరికి మెలిండా తన చిన్ననాటి స్నేహితుడు టోనీని ప్రేమిస్తుంది. దీంతో అతడిని సైతం విక్ చంపేస్తాడు. ఈ సినిమా ఆద్యంతం ఊహించని మలుపులతో నిండి ఉంది. హత్యల తర్వాత విక్ పోలీసులకు పట్టుబడతాడా? మెలిండా ఇలా ఎందుకు చేస్తోంది? ఆమె నిజంగా విక్‌ను ప్రేమిస్తుందా? లేదా మరేదైనా కారణం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ‘డీప్ వాటర్’ చిత్రాన్ని చివరి వరకు చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి : 

Telugu Cinema: టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడేం స్పెషల్ సాంగ్స్‏తో రచ్చ చేస్తుంది.. ఈ క్యూటీ ఎవరంటే..

చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. అయినా ఒక్కో సినిమాకు రూ.11 కోట్లు.. తెలుగువారికి ఇష్టమైన హీరోయిన్..

Nuvvostanante Nenoddantana: ఫ్యాషన్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్.. మహిళలకు రోల్ మోడల్‏.. ఇప్పుడేం చేస్తుందంటే..

Tollywood: సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్.. కారణం ఇదేనట..