Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. బాలకృష్ణ అన్‎స్టాపబుల్ ఎపిసోడ్ నుంచి క్రేజీ వీడియో.. పవర్ స్ట్రోమ్ లోడింగ్..

|

Jan 14, 2023 | 6:48 PM

డార్లింగ్ ఫ్యాన్స్ దెబ్బకు రికార్డ్స్ బద్దలయ్యాయి. ఈ మాసివ్ ఎపిసోడ్‏కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు మరో ఎపిసోడ్ కోసం ఆడియన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఆ ఎపిసోడ్ ఎవరిదో అర్థమయ్యే ఉంటుంది కదూ.. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. బాలకృష్ణ అన్‎స్టాపబుల్ ఎపిసోడ్ నుంచి క్రేజీ వీడియో.. పవర్ స్ట్రోమ్ లోడింగ్..
Pawan Kalyan, Balakrishna
Follow us on

ఇన్నాళ్లు మాస్ యాక్షన్ నటనతో వెండితెరపై అలరించిన నందమూరి బాలకృష్ణలోని మరో కోణాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చింది అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే షో. తనదైన సరదా మాటలతో.. కామెడీ పంచులతో యాంకరింగ్‏కు కొత్తదనం తీసుకువచ్చారు. మొదటి సీజన్ సూపర్ డూపర్ హిట్ కాగా.. ఇక ఇప్పుడు రన్ అవుతున్న సీజన్ 2 బ్లాక్ బస్టర్ హిట్. సినీ, రాజకీయ ప్రముఖులతో బాలయ్య చేసే ఇంటర్వ్యూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, శర్వానంద్, అడివిశేష్ వచ్చి సందడి చేశారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వచ్చిన ఎపిసోడ్ గురించి చెప్పక్కర్లేదు. డార్లింగ్ ఫ్యాన్స్ దెబ్బకు రికార్డ్స్ బద్దలయ్యాయి. ఈ మాసివ్ ఎపిసోడ్‏కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు మరో ఎపిసోడ్ కోసం ఆడియన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఆ ఎపిసోడ్ ఎవరిదో అర్థమయ్యే ఉంటుంది కదూ.. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్.

ఇప్పటికే పవన్.. బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ కూడా సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇక ఎపిసోడ్ గ్లింప్స్, ప్రోమో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవన్ అభిమానులకు సంక్రాంతి కానుక ఇచ్చారు మేకర్స్. పండగా సందర్భంగా వీరి ఎపిసోడ్ కు చెందిన ఓ క్రేజీ వీడియో షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

అందులో వీరిద్దరి గురించి ఇంట్రెస్టింగ్ మోషన్ పోస్టర్ వీడియో డిజైన్ చేశారు. పవర్ స్టార్ మేనియా ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. పవర్ స్ట్రోమ్ లోడింగ్ సూన్ అంటూ పవన్ ఎపిసోడ్ స్పెషల్ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.