18 Pages: ఓటీటీలోకి వచ్చేస్తోన్న అందమైన ప్రేమకథ.. ’18 పేజెస్’ స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా దర్శకుడు సూర్యప్రతాప్ తెరకెక్కించిన చిత్రం '18 పేజెస్'..
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా దర్శకుడు సూర్యప్రతాప్ తెరకెక్కించిన చిత్రం ’18 పేజెస్’. డిసెంబర్ 23న విడుదలైన ఈ చిత్రం ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా తొలి ఆట నుంచే మంచి టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్‌గా సక్సెస్ సాధించింది. ఇక ఇప్పటిదాకా థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం.. ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్దం అవుతోంది. అది కూడా ఒకటి.. ఒకే రోజు రెండు ఓటీటీల్లోకి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ‘ఆహా’ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా మరో ఓటీటీ దిగ్గజం ‘నెట్‌ఫ్లిక్స్’ ’18 పేజెస్’ మూవీ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. ఈ రెండు ఓటీటీల్లో జనవరి 27 నుంచి మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. కాగా, ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పించగా.. బన్నీ వాసు నిర్మించారు. అలాగే దర్శకుడు సుకుమార్ కథను అందించిన సంగతి తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ ఈ మూవీకి బాణీలు అందించాడు.
Page-lu 18 aina, minimum 18 saarlu choodataaniki siddham.
18 pages is coming on Netflix as a post theatrical release!?#NetflixPandaga #18Pages #NetflixLoEmSpecial pic.twitter.com/vkkgK5dV2v
— Netflix India South (@Netflix_INSouth) January 14, 2023
For 100% Telugu entertainment, look no further but #ahavideo.#18PagesOnAha will stream on aha post theatrical release???#18Pages pic.twitter.com/xwnFqilGI6
— ahavideoin (@ahavideoIN) January 14, 2023