
కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని ఓటీటీలు ప్రేక్షకులకు విపరీతంగా అలవాటైపోయాయి. లాక్ డౌన్ సమయంలో థియేటర్స్ బంద్ కావడంతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఓటీటీలు పుట్టుకొచ్చాయి. ఇక ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడమతో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ ఎక్కువయ్యాయి. ఇక ఓటీటీల్లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు, టాక్ షోలు, గేమ్ షోలు అంటూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. అలాగే థియేటర్స్ లో విడుదలైన సినిమాలు దాదాపు నెల రోజుల తర్వాత ఓటీటీల్లోకి విడుదలవుతున్నాయి. ఇక కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే థియేటర్స్ లో విడుదలయ్యే సినిమాలకు సెన్సార్ ఉంటుంది. కానీ ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, సిరీస్ లకు ఎలాంటి సెన్సార్ లేదు.
దాంతో బూతులు, బోల్డ్ కంటెంట్, రొమాన్స్, డ్రగ్స్ వినియోగించే సన్నివేశాలు ఇలా క్రింజ్ ఎక్కువైంది, దాంతో సెంట్రక్ గవర్నమెంట్ ఇప్పుడు ఓటీటీ సంస్థలకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. తాజాగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు అడ్వైజరీని జారీ చేసింది. ఇక పై ఓటీటీలో వచ్చే సినిమాలు’, సిరీస్ లలో డ్రగ్స్ వినియోగాన్ని ప్రోత్సహించడం, బోల్డ్ కంటెంట్‌ను చూపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఓటీటీ కంటెంట్స్ పై వస్తున్న కంప్లైంట్స్ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న కంటెంట్ పై నియంత్రణ లేదని, క్రింజ్ ను ఎక్కువగా చూపిస్తున్నారని, బోల్డ్, వైలెన్స్ కంటెంట్స్ ఎక్కువ అవుతున్నాయని అలాగే సినిమాలు, వెబ్ సిరీస్‌ను తప్పనిసరిగా సెన్సార్ చేయాలనే డిమాండ్లు ఎక్కువగా రావడమతొ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మాదకద్రవ్యాల వినియోగాన్ని ప్రోత్సహించే సన్నివేశాలను చూపించే ముందు వార్నింగ్స్ ఇవ్వాలని.. యువత పై ఎక్కువగా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. సెన్సార్ లేకుండా స్ట్రీమింగ్ చేసిన లేదా హెచ్చరికలు లేకుండా సీన్స్ చూపించినా.. కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది కేంద్రం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.