Bigg Boss OTT Telugu: బిగ్‏బాస్ హౌస్‏లో అప్పుడే రచ్చ షురూ.. స్టేట్‏మెంట్స్ ఇవ్వద్దంటూ శ్రీరాపాకకు అరియానా కౌంటర్..

|

Feb 28, 2022 | 8:37 AM

డిజిటల్ ప్లాట్ ఫాంలో బిగ్‏బాస్ (Bigg Boss) సందడి మొదలైంది. ఇప్పటివరకు బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని అందించిన ఈ షో ఇప్పుడు

Bigg Boss OTT Telugu: బిగ్‏బాస్ హౌస్‏లో అప్పుడే రచ్చ షురూ.. స్టేట్‏మెంట్స్ ఇవ్వద్దంటూ శ్రీరాపాకకు అరియానా కౌంటర్..
Bigg Boss Ott
Follow us on

డిజిటల్ ప్లాట్ ఫాంలో బిగ్‏బాస్ (Bigg Boss) సందడి మొదలైంది. ఇప్పటివరకు బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని అందించిన ఈ షో ఇప్పుడు ఓటీటీలో నో కామా.. నో ఫుల్ స్టాప్.. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంటూ ఫిబ్రవరి 26న గ్రాండ్‏గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. మాజీ కంటెస్టెంట్స్‏ వారియర్స్‎గా వీరితోపాటు.. కొత్తవారు ఛాలెంజర్స్‏గా ఈసారి బిగ్‏బాస్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇందులో వారియర్స్.. ఛాలెంజర్స్ తలపడబోతున్నారు. ఇక పై 24 గంటలు బిగ్‏బాస్ షోను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‏లో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా ఈ షో ప్రోమో విడుదల చేశారు మేకర్స్.

తాజాగా విడుదలైన ప్రోమోలో.. ప్రతిరోజు చాలెంజర్స్ నుంచి అనుమతి పొందిన ఒక వారియర్ మాత్రమే బెడ్ రూంలో పడుకునే అవకాశం ఉంటుందని మెలిక పెట్టారు బిగ్‏బాస్. చాలెంజర్స్ భోజనం చేసిన తర్వాత వారియర్స్ ఒకేచోట కలిసి తినాలని నిబంధన పెట్టారు. వారియర్స్ సభ్యులు ఎవరే పని చేయాలో నిర్ణయించేందుకు చాలెంజర్స్ ఆధర్వంలో జాబ్ మేళా జరిగింది. ఇందులో శ్రీరాపాకకు.. అరియానాకు మధ్య మాటల యుద్ధం నడించింది. ఇంటర్వ్యూలో అరియానాది ఓవర్ యాక్టింగ్ అంటూ ఫైర్ అయ్యింది శ్రీరాపాక. దీంతో .. తనది ఓవర్ యాక్టింగ్ కాదని… తన ఆటిట్యూడ్ ఇదే అని.. నచ్చితే జాబ్ ఇవ్వండి.. స్టేట్ మెంట్స్ మాత్రం ఇవ్వొద్దు అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చింది అరియానా. దీంతో ఇక అరియానాకు.. శ్రీరాపాకకు వార్ జరగనున్నట్టు తెలుస్తోంది.

Also Read: Sarkaru Vaari Paata: యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న కళావతి సాంగ్.. టాలీవుడ్‏లోనే నెంబర్ వన్ రికార్డ్..

Nithiin: సౌత్ ఇండియాలోనే ఆ విషయంలో ఏకైక హీరోగా నితిన్.. బీటౌన్‏లో క్రేజ్ మాములుగా లేదుగా..

Thyroid: థైరాయిడ్ సమస్యతో ఇబ్బందిపడుతున్నారా ? అయితే ఈ జ్యూస్‏లతో చెక్ పెట్టొచ్చు.. అవెంటంటే..

Viral Photo: చూడగానే మైమరిపించే కళ్లు.. చూస్తూనే ఉండాలనిపించే మోము.. ఎవరో గుర్తించారా..?