Lucky Lakshman: ఓటీటీలోకి వచ్చేసిన బిగ్‏బాస్ సోహైల్ ‘లక్కీ లక్ష్మణ్’.. ఎక్కడ చూడొచ్చంటే…

థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫాంపై సందడి చేయబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థలు

Lucky Lakshman: ఓటీటీలోకి వచ్చేసిన బిగ్‏బాస్ సోహైల్ లక్కీ లక్ష్మణ్.. ఎక్కడ చూడొచ్చంటే...
Lucky Lakshman

Updated on: Feb 18, 2023 | 6:42 AM

బిగ్‏బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ కథానాయికుడిగా నటించిన చిత్రం లక్కీ లక్ష్మణ్. డైరెక్టర్ అభి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సోహైల్ సరసన మోక్ష హీరోయిన్‏గా నటించింది. హరిత గోగినేని నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 30న థియేటర్లలో విడుదలైంది. ఆశించిన స్థాయిలో ఈ చిత్రం మెప్పించలేకపోయినప్పటికీ సోహైల్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇప్పుడు థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫాంపై సందడి చేయబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థలు ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియోలలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది.

మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన లక్ష్మణ్ (సోహైల్) . ఆర్థిక పరిస్థితి బాగోలేని కారణంగా అతను ఏది అడిగినా తండ్రి కొనివ్వలేదు. దాంతో అతను చాలా అసంతృప్తికి లోనవుతాడు. ఇంజనీరింగ్ చదివే సమయంలో శ్రియ (మోక్ష)తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. తండ్రిపై ఉన్న కోపంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన అతడికి శ్రియ సాయం చేస్తుంటుంది. అలా స్నేహితుల సాయంలో సొంతంగా మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేసి సక్సెస్ అవుతాడు.

ఇవి కూడా చదవండి

అయితే డబ్బులు రావడంతో అహంకారంతో ప్రేమను కాదనుకుంటాడు. తల్లిదండ్రులను పట్టించుకోడు. ఆ తర్వాత జరిగిన సంఘటనలతో తండ్రి గొప్పతనాన్ని తెలుసుకుంటాడు. తండ్రి కొడుకుల మధ్య ప్రేమను తెలియజేసే నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.