Bangarraju: అక్కినేని నాగార్జున, నాగ చైతన్యలు కలిసి నటించిన చిత్రం బంగార్రాజు. కరోనా సమయంలోనూ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుందీ సినిమా. నాగార్జున నమ్మకాన్ని వమ్ముకాకుండా భారీ విజయాన్ని అందుకుందీ చిత్రం. సంక్రాంతి బరిలో ఒంటరిగా నిలిచి సూపర్ సక్సెస్‌ను అందుకున్నారు అక్కినేని హీరోలు. ఆరేళ్ల క్రితం వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 38.15 కోట్ల ప్రిరిలీజ్ బిజినెస్‌తో పాటు భారీ కలెక్షన్లను రాబట్టింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. థియేటర్లలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న బంగార్రాజు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేశాడు. ఈ విషయాన్ని నాగచైతన్య ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. బంగార్రాజు సినిమా ఫిబ్రవరి 18నుంచి (శుక్రవారం) జీ5 ఓటీటీలో (OTT) ప్రసారమవుతున్నట్లు ట్వీట్ చేశారు చైతన్య. దీంతో కరోనా కారణంగా థియేటర్లలో చిత్రాన్ని వీక్షించలేని అభిమానులకు చిత్ర యూనిట్ ఇలా గుడ్ న్యూస్ చెప్పింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా రమ్మకృష్ణ నటించగా, చైతన్య సరసన కృతీ శెట్టి నటించిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌కు మంచి మార్కులు పడ్డాయి. మరి థియేటర్లలో మంచి బజ్ తెచ్చుకున్న బంగార్రాజు ఓటీటీలో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో.
#Bangarraju will be streaming from 18th Feb exclusively on @ZEE5Telugu.
Watch new #ZEE5 trailer ▶️ https://t.co/MWocTlWr0e#BangarrajuOnZEE5 #BangarrajuFromFeb18th#VaasivaadiTassadiyya pic.twitter.com/KDELs4kZeb
— chaitanya akkineni (@chay_akkineni) February 17, 2022