పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాకతో సరికొత్త రికార్డ్స్ బ్రేక్ చేసింది అన్స్టాపబుల్ సీజన్ 2. నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోకు సినీ ప్రియుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. సీజన్ 1 ఘన విజయాన్ని అందుకోగా.. అంతకు మించి అన్నట్లుగా దూసుకెళ్తుంది సీజన్ 2. ఇందులో ప్రేక్షకుల కోరిక మేరకు తమ అభిమాన తారలను తీసుకువస్తున్నారు మేకర్స్. ఇప్పటికే బాహుబలి స్టార్ ప్రభాస్ తన స్నేహితుడు గోపిచంద్ తో కలిసి సందడి చేశారు. వీరికి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ న్యూయర్ కానుకగా స్ట్రీమింగ్ చేయగా.. ఫ్యాన్స్ దెబ్బకు ఏకంగా ఆహా యాప్ క్రాష్ అయ్యింది. అనంతరం ఈ ఎపిసోడ్కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సెకండ్ ఎపిసోడ్ సైతం స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
జనవరి 6న అర్ధరాత్రి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ప్రభాస్, గోపిచంద్ సెకండ్ ఎపిసోడ్. తాజాగా స్ట్రీమింగ్ అవుతున్న ఎపిసోడ్ చూస్తుంటే వీరిద్దరి మధ్య అనుబంధం ఎలా ఉందో అర్థమవుతుంది. వీరిద్దరిని బాలయ్య తనదైన స్టైల్లో ఓ రేంజ్ లో ఆడుకున్నారు. ఇందులో బాలయ్య అడిగిన ప్రశ్నకు ప్రభాస్ ప్రవర్తించిన తీరు నవ్వులు పూయిస్తుంది. 2008లో మీరిద్దరూ ఓ హీరోయిన్ కోసం గొడవపడ్డారట. ఎవరి కోసం అని అడగ్గా.. ప్రభాస్ నాకు సంబంధం లేదు..గోపికే తెలుసు అన్నాడు.
అప్పుడు గోపిచంద్ మాట్లాడుతూ.. 2008లో కాదు.. సార్.. 2004లో అనుకుంటా. మేమిద్దరం ఓ హీరోయిన్ కోసం గొడవపడ్డాం అన్నారు. ఎవరు ఆ హీరోయిన్ అంటూ బాలయ్య అడగ్గా.. త్రిష అంటూ చెప్పుకొచ్చాడు. గోపిచంద్ ఆన్సర్ విని ప్రభాస్, బాలయ్య షాకయ్యారు. వర్షం సినిమాలో త్రిష కోసం మేము కొట్టుకున్నాం సార్ అని చెప్పి క్లారిటీ ఇచ్చేశారు.
Manandharam enthagano edhuruchusthunna Bahubali Episode part 2 marinni viseshalatho marintha allaritho mee mundhuki vacchesindhi.
The Incredible Part 2 of #UnstoppableWithNBKS2 Bahubali Episode is STREAMING NOW!
▶️ https://t.co/74hP828jLY #PrabhasOnAHA @YoursGopichand #NBKOnAHA pic.twitter.com/CEgdydvkU8— ahavideoin (@ahavideoIN) January 5, 2023
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.