Akhanda 2 OTT: బాలయ్య ఫ్యాన్స్‌కు బిగ్‌ షాక్.. సంక్రాంతికి అఖండ 2 ఓటీటీ రిలీజ్ లేనట్టే! కారణమిదే

బాలయ్య నటించిన లేటెస్ట్ సినిమా అఖండ 2 తాండవం. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాను ఓటీటీలోనూ చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు జనవరి 9 నుంచి అఖండ స్ట్రీమింగ్ కానుందని అనౌన్స్ మెంట్ కూడా రావడంతో బాలయ్య అభిమానులు ఖుషీ అయ్యారు.. కానీ.. ఇప్పుడు..

Akhanda 2 OTT: బాలయ్య ఫ్యాన్స్‌కు బిగ్‌ షాక్.. సంక్రాంతికి అఖండ 2 ఓటీటీ రిలీజ్ లేనట్టే! కారణమిదే
Balakrishna Akhanda 2 Thandavam Movie

Updated on: Jan 06, 2026 | 6:29 PM

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘అఖండ 2: తాండవం’. గతంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా అఖండ కు సీక్వెల్ గా ఇది తెరకెక్కింది. బోయపాటి శీను తెరకెక్కించిన అఖండ 2 డిసెంబర్ 12న పాన్ ఇండియా రేంజ్ లో భారీ స్థాయిలో విడుదలైంది. భక్తి, యాక్షన్ మేళవింపుతో తెరకెక్కిన ఈమూవీ బాలయ్య అభిమానులను బాగానే ఆకట్టుకుంది. సనాతన ధర్మం, హిందూ మతం, ఆధ్యాత్మికతకు సంబంధించిన అంశాలు ఉండడంతో సామాన్య ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపించారు. పలువురు రాజకీయ నాయకులు, స్వామిజీలు కూడా అఖండ 2 సినిమాను చూసి చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు. ట్రేడ్ నిపుణుల అంచనాల ప్రకారం అఖండ 2 సినిమా రూ. 120 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిందిని తెలుస్తోంది. కాగా థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని ఓటీటీలోనూ చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

సంక్రాంతి కానుకగా జనవరి 09 నుంచి అఖండ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు నెట్ ఫ్లిక్స్ యాప్‌లో పేర్కొంది. అప్‌కమింగ్‌ చిత్రాల జాబితాలో కూడా ఈ సినిమాను చేర్చింది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. అయితే ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌ భారీ ట్విస్ట్‌ ఇచ్చింది. నెట్‌ఫ్లిక్స్ క్యాటలాగ్‌లో కనిపించిన అఖండ 2 టైటిల్ అకస్మాత్తుగా తీసేశారు. ముందుగా ఉన్న లింక్ కూడా ఇప్పుడు ఓపెన్ కావడం లేదు. దీంతో ఓటీటీ విడుదల వాయిదా పడిందా? లేదా క్యాన్సిల్ అయ్యిందా? అన్న సందేహాలు మొదలయ్యాయి.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ యాప్ లో మాయమైన అఖండ 2 పోస్టర్..

 

అయితే ఇప్పటివరకు అఖండ-2 స్ట్రీమింగ్‌ వివరాలను నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించలేదు. త్వరలో అధికారికంగా మరో కొత్త తేదీని ఎంపిక చేసుకుని అధికారికంగా వివరాలు ప్రకటించే ఛాన్స్‌ ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి