
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడు మహారాజా మూవీ ఫేమ్ అనురాగ్ కశ్యప్ విలన్ గా నటించిన మరో చిత్రం రైఫిల్ క్లబ్. ఆశిక్ అబు తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ లో అలనాటి టాలీవుడ్ హీరోయిన్ వాణీ విశ్వనాథ్ ఓ కీలక పాత్రలో నటించడం విశేషం. వీరితో పాటు విజయ రాఘవన్, దిలీశ్ పోతన్, సురేశ కృష్ణ, దర్శనా రాజేంద్రన్, సురభి లక్ష్మి, హమన్కింద్, దర్శన రాజేంద్రన్, ఉన్నిమాయ ప్రసాద్, వినీశ్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గతేడాది డిసెంబర్ 19న థియేటర్లలో విడుదలైన రైఫిల్ క్లబ్ మలయాళ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. మోహన్ లాల్ బరోజ్, ఉన్నిముకుందన్ మార్కో వంటి స్టార్ హీరోల సినిమాలతో పోటీపడి మంచి కలెక్షన్లు సాధించింది. పేరుకు తగ్గట్టుగానే ఇందులోని యాక్షన్ సీక్వెన్స్ ఆడియెన్స్ ను థ్రిల్ కు గురిచేశాయి. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ రూ. 35 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన రైఫిల్ క్లబ్ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డులు కొల్ల గొడుతోంది.
రైఫిల్ క్లబ్ యాక్షన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జనవరి17 నుంచి ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ రైఫిల్ క్లబ్ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. కాగా రైఫిల్ క్లబ్ సినిమాకు ఓటీటీలోనూ సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. గత మూడు వారాలుగా ఈ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఇండియా సినిమాల టాప్-10లో ట్రెండింగ్‍లో ఉంటోంది. ఓ దశలో టాప్-2లో నిలిచిన ఈ మూవీ ప్రస్తుతం ఆరో స్థానంలో ట్రెండ్ అవుతోంది. మొత్తానికి పుష్ప 2 లాంటి భారీ సినిమాల పోటీ ఉన్నప్పటికీ గత మూడు వారాల నుంచి రైఫిల్ క్లబ్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో సత్తాచాటుతుండడం విశేషం.
👌 #10 Most searched #Malayalam movie available on @Netflix
⭐ Rating: 7.1/10 IMDb
🎬 Director: Aashiq Abu#RifleClub | #RifleClubonNetflixpic.twitter.com/L6XtHw7SgM
— Shahul (@simplyshahul) January 30, 2025
Ee clubil, thokkine kaalum unnam nokkinu
Watch Rifle Club, now on Netflix!#RifleClubOnNetflix pic.twitter.com/66ADkpdtMa— Netflix India South (@Netflix_INSouth) January 16, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.