AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aha OTT: ఆహా ఓటీటీలో శివన్న బ్లాక్ బస్టర్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్.. ఎప్పటినుంచంటే?

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఇటీవలే క్యాన్సర్ నుంచి కోలుకున్నారు. అమెరికాలో చికిత్స తీసుకున్న ఆయన కొద్ది రోజుల క్రితమే ఇండియాకు తిరిగొచ్చారు. కాగా శివన్న అమెరికాకు వెళ్లేముందు ఆయన నటించిన ఓ బ్లాక్ బస్టర్ సినిమా రిలీజైంది. ఇప్పుడు ఆ మూవీ తెలుగు వెర్షన్ ఓటీటీలోకి రానుంది.

Aha OTT: ఆహా ఓటీటీలో శివన్న బ్లాక్ బస్టర్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్.. ఎప్పటినుంచంటే?
Shiva Rajkumar
Basha Shek
|

Updated on: Feb 11, 2025 | 6:30 PM

Share

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్నఆర్ సీ 16(వర్కింగ్ టైటిల్ ) సినిమాలో శివన్న కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. జాన్వీ కపూర్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. కాగా గతేడాది శివన్న నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘భైరతి రణగల్’. నవంబర్ 15న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కన్నడ ఆడియెన్స్ ను బాగా మెప్పించింది. అందుకే రెండు వారాల తర్వాత తెలుగులోనూ (నవంబర్ 30) విడుదలై ఇక్కడ కూడా మంచి వసూళ్లు సాధించింది. ఇందులో శివరాజ్ కుమార్ ఓ పవర్ ఫుల్ లాయర్ గానూ, అదే సమయంలో పేదల పక్షాన పోరాడే నాయకుడిగానూ అద్భుతంగా నటించాడు. థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన భైరతి రణగల్ ఒరిజినల్ వెర్షన్ ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసింది. ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ లో కన్నడ భాషలో శివన్న మూవీ ఈ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే భైరతి రణగల్ తెలుగు వెర్షన్ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఫిబ్రవరి 13 నుంచి శివన్న సినిమా తెలుగు వెర్షన్ అందుబాబులోకి రానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది ఆహా. నర్తన్ తెరకెక్కించిన ‘భైరతి రణగల్’ సినిమాలో శివరాజ్ కుమార్ సరసన సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. ‘గీతా పిక్చర్స్’ బ్యానర్ పై శివన్న భార్య గీతా శివరాజ్‌కుమార్ ఈ సినిమాను నిర్మించారు. రాహుల్ బోస్, అవినాశ్, దేవ రాజ్, ఛాయా సింగ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బ్రసూర్ సంగీతం అందించారు. మరి థియేటర్లలో ఈ యాక్షన్ థ్రిల్లర్ ను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

 మరో రెండు రోజుల్లో ఆహాలో స్ట్రీమింగ్..

భైరతి రణగల్ సినిమాలో శివరాజ్ కుమార్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్