OTT Movie: ఆడవాళ్ల రక్తం తాగే రాక్షసుడు.. ఓటీటీలో ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చూస్తే వణుకు పుట్టాల్సిందే

ఓటీటీలో అన్ని రకాల కంటెంట్ ఉంటుంది. అయితే ఆడియెన్స్ మాత్రం ఇప్పుడు ఎక్కువగా క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ సినిమాలపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే వివిధ ఓటీటీ సంస్థలు ఎక్కువగా ఈ జానర్ సినిమాలనే స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి.

OTT Movie: ఆడవాళ్ల రక్తం తాగే రాక్షసుడు.. ఓటీటీలో ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చూస్తే వణుకు పుట్టాల్సిందే
OTT Movie

Updated on: Apr 22, 2025 | 9:02 PM

ఈ మధ్యన మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఓటీటీ ఆడియెన్స్ ను బాగా అలరిస్తున్నాయి. అలాగే ఇంగ్లిష్ ఇతర భాషల్లోని క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలను కూడా ఓటీటీ ఆడియెన్స్ ఎక్కువగా చూస్తున్నారు. అయితే ఇతర భాషలతో పోల్చితే తెలుగులో ఈ జానర్ సినిమాలు కొంచెం తక్కువే. అయితే కొన్ని నెలల క్రితం తెలుగులో వచ్చిన ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆడవాళ్ల రక్తం తాగే మనిషి చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం దిమ్మతిరిపోతుంది. అందుకే ఈ సినిమా ఏకంగా మూడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా కథ విషయానికి వస్తే.. హైదరాబాద్ లో కొందరు అమ్మాయిలు వరుసగా కిడ్నాప్‌కు గురవుతారు. దీని వెనక గల మిస్టరీని ఛేదించేందుకు స్పెషల్‌ ఆఫీసర్లుగా హీరో, హీరోయిన్లు రంగంలోకి దిగుతారు. అదే సమయంలో ఎప్పుడో అంతరించిపోయిందనుకున్న ఓ తెగకు చెందిన ఓ వ్యక్తి జనారణ్యంలోకి వచ్చాడని తెలుస్తుంది. అతనే ఆ అమ్మాయిలను కిడ్నాప్ చేసి వారి రక్తం తాగుతుంటాడని తెలుస్తుంది. మరి ఆడవాళ్ల రక్తం తాగే మనిషి ఎవరు? దాని వెనక ఉన్న కథేంటి? పోలీసులు ఎలా అతనిని పట్టుకున్నారో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇంతకీ ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ఏదని అనుకుంటున్నారా? ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా నటించిన హిడింబ. అనిల్‌ కన్నెగంటి తెరకెక్కించిన ఈ సినిమాలో నందితా శ్వేతా హీరోయిన్ గా నటించింది. థియేటర్లలో ఓ మాదిరిగా ఆడిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం అదరగొట్టింది. ఆకట్టుకునే కథా కథనాలు, స్క్రీన్ ప్లే, ట్విస్టులు.. ఇలా అన్నీ అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. మరీ ముఖ్యంగా హిడింబ సినిమా క్లైమాక్స్ ట్విస్ట్ ఎవ్వరూ ఊహించని విధంగా మైండ్ బ్లాక్ అయ్యేలా ఉందని కామెంట్స్ వినిపించాయి. మరి మీరు ఈ సినిమాను చూశారా? లేకపోతే అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్ ఓటీటీల్లో హిడింబను చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.