Anupama Parameshwaran: నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న అనుపమ సినిమా.. బటర్ ఫ్లై స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

|

Dec 12, 2022 | 1:09 PM

పాన్ ఇండియా స్టార్ గా హిట్ అందుకున్న నిఖిల్ సరసన 18 పేజిస్ చిత్రంలో నటిస్తుంది అనుపమ. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్ 23న విడుదల చేయనున్నారు. ఇదే కాకుండా.. ఆమె ప్రధాన పాత్రలో బటర్ ఫ్లై సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ఆకట్టుకోగా..

Anupama Parameshwaran: నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న అనుపమ సినిమా.. బటర్ ఫ్లై స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Anupama
Follow us on

ఇటీవలే కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది మలయాళీ కుట్టి అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస సినిమాలతో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. పాన్ ఇండియా స్టార్ గా హిట్ అందుకున్న నిఖిల్ సరసన 18 పేజిస్ చిత్రంలో నటిస్తుంది అనుపమ. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్ 23న విడుదల చేయనున్నారు. ఇదే కాకుండా.. ఆమె ప్రధాన పాత్రలో బటర్ ఫ్లై సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ఆకట్టుకోగా.. చాలా కాలంగా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు.

ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈనెల 29న స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. ఇందులో హీరోయిన్ భూమిక కూడా కీలకపాత్రలో కనిపించనుంది. తెలుగుతోపాటు.. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని రవి ప్రకాష్, ప్రసాద్, ప్రమోద్ నిర్మించగా.. ఘంట సతీష్ బాబు దర్శకత్వం వహించారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు అనుపమ, నిఖిల్ నటించిన 18 పేజీస్ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టైం ఇవ్వు పి ల్ల, ఏడు రంగుల వాన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.