Anasuya: అన‌సూయ గ‌ర్భిణీగా క‌నిపించ‌డానికి ఎంత క‌ష్ట‌ప‌డ్డారో చూశారా.? ఆక‌ట్టుకుంటోన్న‌ మేకింగ్ వీడియో..

|

May 29, 2021 | 2:34 PM

Anasuya Thank You Brother: న్యూస్ యాంక‌ర్‌గా కెరీర్ ప్రారంభించిన అన‌సూయ‌.. జ‌బ‌ర్ధ‌స్త్ షోతో ఒక్క‌సారిగా స్టార్ యాంక‌ర్‌గా మారారు. ఇక సినిమాల్లో న‌టించి వెండితెర‌పై కూడా మంచి మార్కులు కొట్టేశారు. రంగ‌స్థ‌లం...

Anasuya: అన‌సూయ గ‌ర్భిణీగా క‌నిపించ‌డానికి ఎంత క‌ష్ట‌ప‌డ్డారో చూశారా.? ఆక‌ట్టుకుంటోన్న‌ మేకింగ్ వీడియో..
Anasuya
Follow us on

Anasuya Thank You Brother: న్యూస్ యాంక‌ర్‌గా కెరీర్ ప్రారంభించిన అన‌సూయ‌.. జ‌బ‌ర్ధ‌స్త్ షోతో ఒక్క‌సారిగా స్టార్ యాంక‌ర్‌గా మారారు. ఇక సినిమాల్లో న‌టించి వెండితెర‌పై కూడా మంచి మార్కులు కొట్టేశారు. రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ్మ‌త్త పాత్ర‌తో మ‌రో మెట్టు పైకెక్కారు అన‌సూయ‌. ఇదిలా ఉంటే ఇటీవ‌ల అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ‘థ్యాంక్ యు బ్రదర్‌’ చిత్రం మే 7న ఆహా ఓటీటీ వేదిక‌గా విడుద‌లైన విష‌యం తెలిసిందే.
నిజానికి ఈ సినిమాను థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేయడాన‌కి చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేసింది. కానీ క‌రోనా నేప‌థ్యంలో థియేట‌ర్లు మూత‌ప‌డ‌డంతో చివ‌రికి ఓటీటీలో విడ‌దుల చేశారు. ఈ సినిమాలో అన‌సూయ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ఓ గ‌ర్భిణీ ఎలాంటి క‌ష్టాలు ఎదుర్కొంద‌న్న పాత్ర‌లో అద్భుతంగా న‌టించారు. అన‌సూయ న‌ట‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. ముఖ్యంగా గ‌ర్భిణీగా చాలా స‌హ‌జంగా న‌టించారు. ఇక తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో అన‌సూయ గ‌ర్భిణీగా క‌నిపించ‌డానికి చేసిన మేకప్‌, ఆ పాత్ర‌లో మెప్పించ‌డానికి అన‌సూయ ఎంత‌లా క‌ష్ట‌డిందో స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇక ఈసినిమాను జస్ట్ ఆర్డినరి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై మాగుంట శరత్‌చంద్రారెడ్డి, తారక్‌ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. మ‌రి ‘థ్యాంక్ యు బ్రదర్‌’ మేకింగ్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Also Read: సాగర్ రానా హత్య కేసులో రెజ్లర్ సుశీల్ కుమార్ కు పెద్ద దెబ్బ !..ప్రభుత్వ అప్రూవర్ గా మారనున్న సన్నిహితుడు ప్రిన్స్

Canara Bank: లోన్‌ తీసుకోవాలనుకునే వారికి శుభవార్త.. 6 నెలలు ఈఎంఐ కట్టక్కర్లేదు! వివరాలివే..

Sharwanand: నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపిన హీరో శర్వానంద్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..