సూపర్ హిట్ కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఓటీటీ ఆహా.. మరో హర్ట్ టచింగ్ కంటెంట్‌ను ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చింది. అనుకోకుండా ఓ ఎలివేటర్‌లో ఇరుక్కుపోయినా రిచ్ యంగ్ మాన్, ప్రెగ్నెంట్ విమెన్ మధ్య జరిగే కథే థాంక్యూ బ్రదర్.
రిచ్ మ్యాన్ అభిగా విరాజ్ అశ్విన్, ప్రెగ్నెంట్ విమెన్‌గా అనసూయ భరద్వాజ్ నటించిన ఈ సినిమాకు డిజిటల్ ఆడియన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా విరాజ్, అనసూయ పెర్ఫామెన్స్ అద్భుతం అంటున్నారు ఆడియన్స్. అనసూయ సినిమా మొత్తం తానై నడిపిస్తూ ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా గర్భవతి పాత్రను చాల చక్కగా పోషించింది. ఈ సినిమాను జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంలో మాగుంట శరత్ చంద్రారెడ్డితో కలిసి తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి నిర్మించారు. ఈ సినిమాకు రమేశ్ రాపర్తి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అర్చన, వైవా హర్ష, అనిల్ కురువిల్లా, అన్నపూర్ణ, మౌనిక రెడ్డి, ఆదర్శ్, కాదంబరి కిరణ్ సమీర్ ముఖ్య పాత్రలు పోషించారు. కన్నతల్లి విలువను చాలా బాగా చూపించారు.
అచ్చ తెలుగు కంటెంట్‌కు కేరాఫ్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఆహా ఇప్పుడు బ్లాక్ బస్టర్ కంటెంట్‌కు పర్మినెంట్ అడ్రెస్‌గా మారుతోంది. వరుసగా సూపర్ హిట్ ఒరిజినల్స్‌ను అందిస్తున్న ఈ ఓటీటీలో థాంక్యూ బ్రదర్ మరో బిగ్ హిట్‌గా నిలుస్తుందన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు ఆహా టీమ్.
మరిన్ని ఇక్కడ చదవండి :