OTT Movie: పౌర్ణమి రోజున రెచ్చిపోయే రక్త పిశాచి.. ఓటీటీలో ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్.. చిన్న పిల్లలు చూడొద్దు

థియేటర్లలో రిలీజైన చాలా రోజుల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. కాగా ఈ సినిమా రిలీజ్ ముందే మేకర్స్ ఒక అనౌన్స్ మెంట్ చేశారు. చిన్న పిల్ల‌లు త‌మ సినిమాను చూడొద్దంటూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చింది.

OTT Movie: పౌర్ణమి రోజున రెచ్చిపోయే రక్త పిశాచి.. ఓటీటీలో ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్.. చిన్న పిల్లలు చూడొద్దు
OTT Movie

Updated on: May 28, 2025 | 3:08 PM

సాధారణంగానే హారర్ థ్రిల్లర్ సినిమాలు చాలా భయానకంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా హాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు తరచూ రిలీజవుతుంటాయి. ఈ మధ్యన హిందీ, తమిళం, మలయాళ భాషల్లోనూ ఈ జానర్ టైపు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే ఇతర భాషలతో పోల్చితే తెలుగులో ఇలాంటి సినిమాలు చాలా తక్కువగా తెరకెక్కుతుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా ఒక ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్ జానర్ కు చెందినది. చేతబడులు, క్షుద్ర పూజల నేపథ్యంలో ఈ సినిమాను ఎంతో ఆసక్తికరంగా రూపొందించారు మేకర్స్. తాంత్రిక పూజ‌ల్లో ఆరు ప‌ర్వాలు ఉంటాయ‌ంటూ ఓ అమ్మాయిని మాంత్రికుడు బ‌లి ఇవ్వాల‌ని అనుకోవ‌డం ఈ స్టోరీలో మెయిన్ పాయింట్. ఈ సినిమా మొత్తం రేఖ అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది.

క్షుద్ర శ‌క్తుల కార‌ణంగా జ‌న్మించ‌డంతో ఆమె చుట్టూ ఎప్పుడూ ద‌య్యాలు తిరుగుతుంటాయి. రేఖ‌కు కూడా క‌నిపిస్తుంటాయి. పౌర్ణ‌మి వ‌చ్చిందంటే చాలు.. రేఖ‌ను వెతుక్కుంటూ ఓ ర‌క్త పిశాచి వ‌స్తుంటుంది. ఈ క్రమంలో త‌న‌తో పాటే కాలేజీలో చ‌దువుకుంటున్న క్లాస్‌మేట్ తేజూను రేఖ ఇష్టపడుతుంది రేఖ‌. అయితే తేజూ వేశ్య కొడుకు కావ‌డంతో ఇద్దరి ప్రేమ‌కు అడ్డంకులు ఏర్పడుతాయి. మరి ఆ తర్వాత ఏం జరిగింది? క్షుద్ర శ‌క్తుల బారి నుంచి రేఖ ఎలా బ‌య‌ట‌ప‌డింది? అసలు రేఖ నేపథ్యం ఏమిటి? ఆమెను బ‌లి ఇవ్వాల‌ని మాంత్రికుడు ఎందుకు అనుకున్నాడు? అతని బారి నుంచి రేఖ బ‌య‌ట‌ప‌డిందా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

 

ఈ ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా పేరు తంత్ర. తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించింది. అలాగే స‌లోని, ధ‌నుష్ ర‌ఘుముద్రి, టెంప‌ర్ వంశీ తదితరులు ప్రధాన పాత్ర‌లు పోషించారు. శ్రీనివాస్ గోపిశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గ‌త ఏడాది మార్చిలో థియేట‌ర్ల‌లో రిలీజైన యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. ఇప్పటికే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్నఈ మూవీ ఇప్పుడు స‌డెన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ సినిమాలు చూసే వారికి తంత్ర సినిమా ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్ లోనూ స్ట్రీమింగ్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .