
ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప 2 ఫీవర్ నడుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా గురువారం (డిసెంబర్ 05) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత అల్లు అర్జున్ సినిమా రావడం, అందులోనూ క్రేజీ సీక్వెల్ కావడంతో ఆడియెన్స్ పుష్ప 2 థియేటర్లల పోటెత్తుతున్నారు. ఇక ప్రతి చోటా బన్నీ సినిమాకు బ్లాక బస్టర్ టాక్ వస్తోంది. రికార్డులు బద్దలవ్వడం గ్యారంటీ అని సినిమా చూసిన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో
పుష్ప 2 సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్ నర్ కూడా ఫిక్స్ అయ్యింది. దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ ధరకు పుష్ప 2 స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఇందుకోసం పుష్ప 2 మేకర్స్ కు సుమారు రూ. 250 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే పుష్ప 2 సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది కాబట్టి కాస్త ఆలస్యంగానే ఓటీటీలోకి వస్తుందని అంటున్నారు. సంక్రాంతి తర్వాతే పుష్ప 2 సినిమా స్ట్రీమింగ్ ఉండవచ్చని తెలుస్తోంది.
కాగా డిసెంబర్ 4న ‘సంధ్య 70ఎంఎం’ థియేటర్లో అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా చూశారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో థియేటర్ కు వచ్చిన బన్నీ అభిమానులతో కలిసి ఈ సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు.అల్లు అర్జున్తో పాటు రష్మిక, ఫహద్ ఫాసిల్, తారక్ పొన్నప్ప సునీల్, అనసూయ తదితరులు ఈ సినిమాలో నటించారు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.