అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ ఏజెంట్. ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా నిన్న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మొదటి షో నుంచే ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ఓపినింగ్స్ అయితే బాగానే వచ్చాయి కానీ.. టాక్ మాత్రం మిక్స్డ్ గా వస్తోంది. అఖిల్ కష్టం వృధా అయ్యిందని అంటున్నారు చూసిన ప్రేక్షకులు. చాలా కాలంగా సాలిడ్ హిట్ కొట్టాలన్న కసిమీదున్న అఖిల్ ఈసారి యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులను అలరించడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో అఖిల్ రా ఏజెంట్ గా కనిపించనున్నారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో మలయాళ నటుడు మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నాడు.
ఇక ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై ఆసక్తికర టాక్ ఇప్పుడు ఫిలిమ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఏజెంట్ సినిమా ఒక నెల లోపే ఓటీటీలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏజెంట్ సినిమా మే చివరిలో ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశాలు వినిపిస్తున్నాయి.
మే నెలాఖరులోపు సోనీలివ్‌లో ఏజెంట్ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. వీలైతే మే మూడో వారంలోపే ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట మేకర్స్.