ప్రముఖ తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించాడు అజయ్ కతుర్వార్. గతంలో రాగల 24 గంటల్లో, అలాంటి సిత్రాలు తదితర సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించాడీ యంగ్ హీరో. అయితే ఈ సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. అయితే అతను మాత్రం వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అలా అజయ్ నటించిన చిత్రం విశ్వక్. మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 18న థియేటర్లలో విడుదలైంది. అయితే సరిగా ప్రమోషన్స్ లేకపోవడంతో పెద్దగా ఆడలేకపోయింది. అయితే అజయ్ నటనకు మంచి పేరొచ్చింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 విశ్వక్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జీ5 ఓటీటీలో ఈ యూత్ ఫుల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా విశ్వక్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది జీ5. ‘ప్రతి విద్యార్థి తప్పక చూడాల్సిన సినిమా విశ్వక్. జూన్ 2 నుంచి జీ 5 స్ట్రీమింగ్ అవ్వనున్న విశ్వక్ సినిమాని మిస్ అవ్వకుండా ఫ్రీగా చూడండి’ అని ట్వీట్ చేసింది. విదేశీమోజు లో పడిపోయిన యువతరం ఆలోచనా విధానం మారాలనే పాయింట్‌తో దర్శకుడు వేణు ముల్కల్ల ఈ సినిమాను తెరకెక్కించారు.డింపుల్ హీరోయిన్‌గా నటించింది. తాటికొండ ఆనందం బాలకృష్ణ ఈ సినిమాను నిర్మించగా, సత్య సాగర్ పోలం స్వరాలు సమకూర్చాడు. ప్రదీప్ దేవ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. మరి థియేటర్లలో విశ్వక్ సినిమాను మిస్ అయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
ప్రతి విద్యార్థి తప్పక చూడాల్సిన సినిమా విశ్వక్..!
జూన్ 2 నుంచి #Zee5 లో stream అవ్వనున్న #Vishwak సినిమాని Miss అవ్వకుండా free గా చూడండి.!@ajaykathurvar @goldenduckpro #VishwakOnZee5 #FreeMovie #TelanganaFormationDay #AjayKathurvar #Zee5movies #zee5telugu pic.twitter.com/SRZ6D5iZhw
— ZEE5 Telugu (@ZEE5Telugu) May 29, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..