సీనియర్ నటుడు అజయ్ ఘోష్, తెలుగు హీరోయిన్ చాందినీ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి. మరో సీనియర్ హీరోయిన్ ఆమని మరో కీలక పాత్ర పోషించింది. పోస్టర్స్, టీజర్,ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉండడంతో రిలీజ్ కు ముందే ఈ సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే జూన్ 14వ తేదీన థియేటర్లలో రిలీజైన మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఎమోషనల్ గా సాగే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావడంతో కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. థియేటర్లలో ఆడియెన్స్ ను ఓ మోస్తరుగాఅలరించిన మ్యూజిక షాప్ మూర్తి సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ను కూడా ప్రకటించింది. జూలై 16వ తేదీన మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాను స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన వెలువరించింది. ఈ మేరకు సినిమాకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.
శివ పాలడుగు తెరకెక్కించిన మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాలో అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఫ్లై హై సినిమాస్ పతాకంపై హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించిన ఈ సినిమాకు పవన్ సంగీతం అందించారు. శ్రీనివాస్ బెజుగం సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా.. నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.
You are attention please the train EtvWin Express is coming near your TV’s and Mobile devices for an non-stop entertainment express 🤩🤩 Stay Tuned!#Haromhara#musicshopmurthy #khokho pic.twitter.com/zJAzqjsIID
— ETV Win (@etvwin) July 12, 2024
ఇక మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా కథ విషయానికి వస్తే.. ఓ చిన్న టౌన్‍లో 50 ఏళ్ల మూర్తి (అజయ్ ఘోష్) ఓ మ్యూజిక్‍షాప్ నడుపుతుంటారు. అయితే జనరేషన్ మారడంతో షాప్ సరిగా నడవదు. ఆదాయం కూడా పడిపోతుంది. దీంతో ఆ షాప్ మూసేయాలని అతని భార్య (ఆమని) వాదిస్తుంటుంది. అయితే, సంగీతంపై మక్కువతో ఆ షాప్ అలాగే కొనసాగిస్తాడు మూర్తి. అదే సమయంలో డీజే నేర్చుకోవాలని మూర్తికి సూచిస్తుంది అంజన (చాందినీ చౌదరి). దీంతో 50 ఏళ్ల వయసులో డీజే కావాలనుకుంటారు మూర్తి? మరి ఆయన కల నెరవేరిందా? మూర్తి డీజే అయ్యాడా? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.