OTT Movie: అంతుచిక్కని రహస్యాలు.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు.. మైథిలాజికల్ థ్రిల్లర్ మూవీ ఎక్కడ చూడొచ్చంటే..

|

Oct 19, 2024 | 3:36 PM

ఓటీటీ మూవీ లవర్స్‏కు హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అంటే చాలా ఆసక్తి. ఈ క్రమంలోనే కొన్నాళ్లుగా ఇలాంటి కంటెంట్ అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్. తెలుగులోనే కాకుండా ఇతర భాషలలోనూ సూపర్ హిట్ అయిన చిత్రాలను ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఓ సినిమాను డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేశారు. అదెంటో తెలుసుకుందామా.

OTT Movie: అంతుచిక్కని రహస్యాలు.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు.. మైథిలాజికల్ థ్రిల్లర్ మూవీ ఎక్కడ చూడొచ్చంటే..
Aindham Vedham
Follow us on

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఎన్నో రకాల కంటెంట్ వస్తుంటుంది. హారర్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ, యాక్షన్ ఇలా ఎన్నో జానర్ చిత్రాలు విడుదలవుతుంటాయి. అలాగే ఇలాంటి కంటెంట్ వెబ్ సిరీస్ సైతం మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఇప్పటికే వణుకు పుట్టించే హారర్ చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నాలుగు జానర్స్ కలిపిన మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఐంధమ్ వేదమ్. అభిరామి మీడియా వర్క్స్ బ్యానర్ మీద అభిరామి రామానాథన్ , నల్లమై రామనాథన్ నిర్మించిన ఈ ఒరిజినల్ వెబ్ సిరీస్ ఐంధమ్ వేదమ్. ఎల్. నాగరాజన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో సాయి ధన్సిక, సంతోష్ ప్రతాప్, వివేక్ రాజగోపాల్, వైజీ మహేంద్రన్, క్రిషా కురుప్, రాంజీ, దేవదర్శిని, మాథ్యూ వర్గీస్ కీలకపాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్ తోనే ఈ సిరీస్ పై మంచి క్యూరియాసిటీ నెలకొంది.

తాజాగా విడుదలైన ఐంధమ్ వేదమ్ ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆధ్యంతం మైథలాజికల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగే ఐంధమ్ వేదమ్ ట్రైలర్ ఆసక్తిని కలిగించింది. “వెయ్యేళ్లకు ఒకసారి గురుడు, శుక్రుడు, శని, కుజుడు ఈ నాలుగు గ్రహాలు సూర్యుడిని చూసే విధంగా ఒకే వరుసలో ఉంటాయిట. అలా జరిగినప్పుడు అద్భుతం జరుగుతుందని చరిత్ర చెబుతుంది. నాలుగు వేదాలు ఉన్నాయి. ఐదో వేదం ఇప్పుడు బయటకు రాబోతుంది” అంటూ వచ్చే డైలాగ్స్ మరింత క్యూరియాసిటీని పెంచాయి.

మర్డర్, మిస్టరీ, థ్రిల్లర్, సోషియో ఫాంటసీ ఇలా నాలుగు జానర్స్ కలిపి ఐంధమ్ వేదమ్ వెబ్ సిరీస్ తెరకెక్కించారు. ట్రైలర్ లో చూపించిన విజువల్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ భయాన్ని కలిగిస్తుంది. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో అక్టోబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ భాషలలో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది.

ఇది చదవండి :

Bhadra Movie: వార్నీ.. ఏం ఛేంజ్ భయ్యా..’భద్ర’ మూవీలో రవితేజ మరదలు.. ఇప్పుడు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..

Actress Laya: అందంలో అమ్మను మించిపోయిన డాటర్.. హీరోయిన్ లయ కూతురిని చూశారా..?

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.