3 Roses Season 2 : నువ్వు RCB ఫ్యాన్‌వా? 3 రోజెస్ ‘బెట్టింగ్ భోగి’ గ్లింప్స్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కొన్నాళ్ల క్రితం ఓటీటీ ప్రియులను అమితంగా అలరించిన తెలుగు వెబ్ సిరీసుల్లో 3 రోజెస్ కూడా ఒకటి. ఇప్పుడీ సూపర్ హిట్ సిరీస్ కు సెకెండ్ సీజన్ వచ్చేస్తోంది. తాజాగా 3 రోజెస్ సెకెండ్ సీజన్ నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది.

3 Roses Season 2 : నువ్వు RCB ఫ్యాన్‌వా? 3 రోజెస్ బెట్టింగ్ భోగి గ్లింప్స్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
3 Roses Season 2

Updated on: May 27, 2025 | 1:46 PM

ఈషా రెబ్బా, సత్య, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ “త్రీ రోజెస్”. ఆహా ఓటీటీలో సూపర్ హిట్టయిన ఈ సిరీస్ కు ఇప్పుడు సీజన్ 2 రాబోతోంది. ఈ సిరీస్ ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా..కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ క్రేజీ వెబ్ సిరీస్ త్వరలోనే ఆహాలో స్ట్రీమింగ్ కు రానుంది. తాజాగా ప్రమోషన్లలో భాగంగా మంగళవారం (మే 27) త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి యాక్టర్ సత్య చేసిన ‘బెట్టింగ్ భోగి’ క్యారెక్టర్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

ప్రస్తుతం విశ్వంభర, రాజా సాబ్ , పెద్ది వంటి ప్రెస్టీజియస్ మూవీస్ లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నా సత్య..”త్రీ రోజెస్” కంటెంట్ ను ఇష్టపడి ఈ వెబ్ సిరీస్ లో నటించాడు. సత్యను ఫస్ట్ టైమ్ ఓ వెబ్ సిరీస్ లో పరిచయం చేస్తోంది మాస్ మూవీ మేకర్స్. ఈ సిరీస్ లో హీరోయిన్ రాశీ సింగ్ భర్తగా సత్య నటిస్తున్నాడు. సత్య చేసిన ‘బెట్టింగ్ భోగి’ క్యారెక్టర్ గ్లింప్స్ హిలేరియస్ గా ఉండి నవ్విస్తోంది. క్రికెట్ మ్యాచ్ లపై బెట్టింగ్స్ పెట్టే ‘బెట్టింగ్ భోగి’గా మనం రియల్ లైఫ్ లో చూసే ఎంతోమందిని గుర్తుచేశాడు సత్య. ముఖ్యంగా నువ్వు ఆర్సీబీ ఫ్యాన్ వా.. కెరీర్ మీద కాస్త గట్టగా ఫోకస్ చేయాల్సిందే తదతర లేటెస్ట్ ట్రెండింగ్ డైలాగులను ఇందులో జోడించారు. రాశీ సింగ్, సత్య మధ్య వచ్చే సీన్స్ అన్నీ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందించబోతున్నాయి. త్వరలోనే “త్రీ రోజెస్” సీజన్ 2 వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది.

ఇవి కూడా చదవండి

 

ముంబై ఇండియన్స్ ఫ్యాన్ గా..

బెట్టింగ్ భోగి గ్లింప్స్ వీడియో.,.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.