aha : మరోఆసక్తికర సినిమాతో రానున్న ఆహా.. డార్క్ కామెడీ జోనర్‌లో ‘సత్తిగాని రెండు ఎకరాలు’
అభినవ్ దండ దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. కొల్లూరు బ్యాక్ డ్రాప్‌తో సినిమా తెరకెక్కుతుంది. ఇందులో పుష్ప ఫేమ్ జగదీష్ భండారి ఇప్పటి వరకు చేయనటువంటి ఓ డిఫరెంట్ రోల్ చేస్తున్నారు.
వందశాతం తెలుగు కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తోంది ఆహా. తాజాగా ఆహా ఒరిజినల్ ఫిల్మ్ ‘సత్తగాని రెండు ఎకరాలు’ను అనౌన్స్ చేసింది. పుష్ప వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌ను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. అభినవ్ దండ దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. కొల్లూరు బ్యాక్ డ్రాప్‌తో సినిమా తెరకెక్కుతుంది. ఇందులో పుష్ప ఫేమ్ జగదీష్ భండారి ఇప్పటి వరకు చేయనటువంటి ఓ డిఫరెంట్ రోల్ చేస్తున్నారు. డార్క్ కామెడీ జోనర్‌లో ఎవరరూ ఊహించని ట్విస్టులు, టర్నులతో మూవీ ఆడియెన్స్‌ని మెప్పించనుంది. వెన్నెల కిషోర్ సహా పలువురు నటీనటులు ఇందులో ఇతర కీలక పాత్రల్లో నటించారు. సత్తిగాని రెండు ఎకరాలు సినిమా మన మూలాలను గుర్తుకు తెస్తూ మనకు కనెక్ట్ అయ్యే చిత్రంగా రూపొందుతుంది. దీన్ని 190కి పైగా దేశాల్లో ఆహా వీక్షకులు రానున్న క్రిస్మస్‌కు ఎంజాయ్ చేయబోతున్నారు.
ఈ సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ మాట్లాడుతూ ‘‘డిఫరెంట్ కంటెంట్ సినిమాలను ఎంజాయ్ చేసే మన ప్రేక్షకుల కోసం మా బ్యానర్ నుంచి తొలి తెలుగు ఓటీటీ సినిమాను తీసుకు రాబోతున్నాం. ఇది మాకెంతో థ్రిల్లింగ్‌గా ఉంది. మా ఆడియెన్స్‌ను ఆకట్టుకోవటానికి, వారికి తిరుగులేని ఎంటర్‌టైన్మెంట్ అందించటానిఇకి, వారికి మరింత దగ్గర కావటానికి మరో మాధ్యమంలోకి అడుగు పెట్టటమనేది చాలా సంతోషంగా ఉంది. సత్తిగాని రెండు ఎకరాలు పవర్‌ఫుల్ స్టోరి లైన్‌తో పాటు అమేజింగ్ మ్యూజిక్‌తో మిళితమై ఉంది. అలాగే ఆహాతో కలిసి ఈ సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. సత్తిగాని రెండు ఎకరాలు కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.