AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dacoit OTT: ఓటీటీలోకి ‘డెకాయిట్’! అడివి శేష్, మృణాళ్‌ క్రేజీ యాక్షన్ లవ్ స్టోరీ స్ట్రీమింగ్ డేట్ ఇదే!

అడివి శేష్, మృణాళ్ ఠాకూర్ హీరో, హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ సినిమా డెకాయిట్. ఏప్రిల్ 10న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది.

Dacoit OTT: ఓటీటీలోకి 'డెకాయిట్'! అడివి శేష్, మృణాళ్‌ క్రేజీ యాక్షన్ లవ్ స్టోరీ స్ట్రీమింగ్ డేట్ ఇదే!
Dacoit Movie
Basha Shek
|

Updated on: Apr 29, 2026 | 10:36 AM

Share

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన క్రేజీ యాక్షన్ లవ్ స్టోరీ డెకాయిట్. షానీల్ డియో తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ మృణాళ్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.  బాలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అనురాగ్ కశ్యప్ ఈ మూవీలో విలన్ గా నటించారు.  ఏప్రిల్ 10న రిలీజైన డెకాయిట్ సూపర్ హిట్ గా నిలిచింది. మూడు వారాల తర్వాత కూడా వీకెండ్స్‌లో మంచి బుకింగ్స్ రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓవరాల్ గా రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా నిర్మాతలకు మంచి గానే లాభాలు తెచ్చిపెట్టింది. అడివి శేష్ నటన, మృణాల్ గ్లామర్, భీమ్స్ సిసిరోలియో అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ డెకాయిట్ సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించాయి. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. డెకాయిట్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం చిత్ర నిర్మాతలకు భారీగానే చెల్లించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో మే 8 నుంచి డెకాయిట్ సినిమా నెట్ ఫ్లిక్స్ లోకి స్ట్రీమింగ్ కు రానున్నట్లు సమాచారం. తెలుగు, హిందీతో పాటు ఇతర ప్రధాన భాషల్లోనూ ఒకేసారి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, స్ట్రీమింగ్ డేట్ దాదాపు ఖరారైనట్టే తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్ ఎస్ క్రియేషన్స్ సునీల్ నారంగ్ ప్రొడక్షన్ బ్యానర్లపై సుప్రియ యార్లగడ్డ, సునీల్‌ నారంగ్‌  సంయుక్తంగా డెకాయిట్ సినిమాను నిర్మించారు. ప్రకాశ్ రాజ్ ,సునీల్, అతుల్ కులకర్ణి, కామాక్షి భాస్కర్ల, జయన్ మేరీ ఖాన్, జరీనా వాహబ్  తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరీలియో ఈ సినిమాకు స్వరాలందించారు. ముఖ్యంగా చిచ్చు బుడ్డి సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. మరి థియేటర్లలో డెకాయిట్ సినిమాను మిస్ అయ్యారా? లేదా మరోసారి ఈ క్రేజీ యాక్షన్ లవ్ స్టోరీని చూడాలనుకుంటున్నారా? అయితే కొద్ది రోజులు ఆగండి ఎంచెక్కా ఓటీటీలోకి వచ్చేస్తోంది.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి అడివి శేష్ డెకాయిట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్