పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో క్షణం తిరిక లేకుండా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్.. ప్రస్తుతం సలార్, ఆదిపురుష్, స్పిరిట్, ప్రాజెక్ట్ కే చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ కాగా.. మిగతా సినిమాలో షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే క్షణం కూడా తీరిక లేకుండా గడిపేస్తున్న యంగ్ రెబల్ స్టార్ తాజాగా ఓ చిన్న వెబ్ సిరీస్ పై ప్రశంసలు కురిపించాడు.. ఇంతకీ ఆ వెబ్ సిరీస్ ఏంటీ ?.. అందులో ఏముంది ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ? తెలుసుకుందామా..
ఎప్పటికప్పుడు సినీ ప్రియులకు 100 శాతం ఎంటర్టైన్మెంట్ అందిస్తూ డిజిటల్ ప్లాట్ ఫాంలో దూసుకుపోతుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. ఇప్పటికే సూపర్ హిట్ చిత్రాలు, సస్పెన్స్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్లు, గేమ్ షోస్ తో ప్రేక్షకులను అలరించిన ఆహా.. ఇప్పుడు మరో థ్రిల్లింగ్ హర్రర్ జోనర్ సిరీస్ తీసుకువచ్చింది. రెజీనా కెసాండ్రా, నివేదితా సతీష్ ముఖ్య పాత్రధారులుగా నటిస్తోన్న లేటేస్ట్ వెబ్ సిరీస్ అన్య స్ ట్యుటోరియల్. ఈ వెబ్ సిరీస్ ను బాహుబలి ప్రొడ్యూసర్స్ ఆర్కా మీడియా నిర్మిస్తుంది. ఈ వెబ్ సిరీస్ తెలుగు, తమిళ్ భాషలలో అతి త్వోరలోనే ఆహా లాంచ్ చేయనుంది. తాజాగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా వారి హారర్ వెబ్ సిరీస్ ‘అన్య’స్ ట్యుటోరియల్’ టీజర్ ను లాంచ్ చేసారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ, “అన్య’స్ ట్యుటోరియల్ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ టీజర్ లాంచ్ చేయడం నాకు సంతోషంగా ఉంది. అల్ ది బెస్ట్ టు టీం అఫ్ అన్య.” అంటూ చెప్పుకొచ్చారు.
ప్రపంచం మొత్తం ఇప్పుడు డిజిటల్ దిక్కు అడుగులు వేస్తుంది. కానీ అదే డిజిటల్ రంగం అందరిని భయపెడితే? అదే అన్య’స్ ట్యుటోరియల్. అన్య (నివేదితా సతీష్) ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ కావాలని ప్రయత్నిస్తుంది. రెజీనా కెసాండ్రా (మధు) కి తన చెల్లి అన్య ప్రొఫెషన్ అంటే నచ్చదు. కానీ ఒక రోజు మొత్తం మారిపోతుంది. ఎవరూ చూడని విధంగా సైబర్ ప్రపంచం మొత్తం భయపడుతుంది. అసలు ఎందుకు? అని తెలుసుకోవాలంటే ఆహా మరియు ఆర్కా మీడియా వారి ‘అన్య’స్ ట్యుటోరియల్’ చూడాల్సిందే. అభిమానుల కోసం ఆహా వారు ఈ వెబ్ సిరీస్ ను తెలుగు, తమిళ భాషలలో విడుదల చేయబోతున్నారు.
Rebel Star #ActorPrabhas is impressed with the teaser of #AnyasTutorial.
Have you seen the thrilling teaser yet?Like, Share, Get Scared. #AnyasTutorialOnAHA Screaming from July 1st!! @ReginaCassandra @nivedhithaa_Sat #PallaviGangireddy @somisings pic.twitter.com/kOIfq2kBZs
— ahavideoin (@ahavideoIN) June 11, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.