యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రదాన పాత్రలో డైరెక్టర్ చందు మోండేటి తెరకెక్కించిన లేటేస్ట్ చిత్రం కార్తికేయ 2 (Karthikeya 2). గతంలో సూపర్ హిట్ అయిన కార్తికేయ సినిమాకు సిక్వెల్ గా వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. ఆగస్ట్ 13న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబడుతుంది. మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకున్న ఈ చిత్రం నిఖిల్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇటీవలే కార్తికేయ 2 సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డే్ట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.
సక్సె్స్ఫుల్ గా దూసుకుపోతున్న ఈ మూవీ త్వరలోనే డిజిటిల్ ప్లాట్ ఫాంపై సందడి చేయనుందట. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫాం జీ5 సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక కార్తికేయ 2 దాదాపు 50 రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూసి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ మరింత పొడగించే అవకాశం కూడా లేకపోలేదని టాక్. త్వరలోనే కార్తికేయ 2 ఓటీటీ రిలీజ్ అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి.