
ఓటీటీలో భయపెట్టే హారర్ థ్రిల్లర్ సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ మూవీ మాత్రం చాలా డిఫరెంట్. పేరుకు హారర్ థ్రిల్లర్ సినిమానే అయినా ఇప్పటివరకు ఏ సినిమాలోనూ చూపించని సరికొత్త పాయింట్ ను ఇందులో చూపించారు. కొన్ని రోజుల క్రితం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించింది. తమిళంతో పాటు తెలుగులోనూ మంచిగానే ఆడింది. ముఖ్యంగా ఈ సినిమా కాన్సెప్ట్ అద్భుతంగా ఉందని ప్రశంసలు వినిపించాయి. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మున్నార్‌లోని ఒక మెడికల్ కళాశాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఈ కాలేజీలో వరుస మరణాలు చోటు చేసుకుంటాయి. మృతదేహాలపై చిత్ర విచిత్రమైన మార్కులు కనిపిస్తుంటాయి. దీంతో కాలేజీలో ఏదో ఉందని అందరూ అనుమానిస్తారు. దీనిని కనిపెట్టేందుకు రూబాన్ ఒక ప్రొఫెషనల్ ఘోస్ట్ హంటర్ ను కాలేజీకి పిలిపిస్తారు. అతను కొన్ని సైంటిఫిక్ టూల్స్ ఉపయోగించి ఆత్మలను ట్రాక్ చేస్తాడు. అదే సమయంలో మరణాల వెనక కొన్ని షాకింగ్ సీక్రెట్స్ ఉన్నాయని తెలుసుకుంటాడు. ఒక వింత శబ్దం వల్లనే స్టూడెంట్స్ భయపడి చనిపోతున్నారని అర్థం చేసుకుంటాడు.
ఇంతలోనే కాలేజీలో మరో స్టూడెంట్ చనిపోతాడు. రూబాన్ ఆ సౌండ్ ను రికార్డ్ చేసి కాలేజీలో ఆత్మలు ఉన్నాయని కన్ఫర్మ్ చేస్తాడు. ఆ తర్వాత కాలేజీ గత చరిత్ర గురించి తెలుసుకోవడం మొదలు పెడతారు. 20 ఏళ్ల క్రితం ఇదే కాలేజీలో ఒక మ్యూజిక్ టీచర్ అనుమానాస్పదంగా చనిపోయిందని తెలుసుకుంటాడు. కాలేజీ స్టాఫ్ ఆమెను అన్యాయంగా ఇరికించి చంపేశారని తెలుస్తుంది. ఇంతలోనే మరో స్టూడెంట్ చనిపోతాడు? మరి రూబాన్ ఆ మ్యూజిక టీచర్ ఆత్మను ఎలా అడ్డుకున్నాడు? స్టూడెంట్ ల వరుస మరణాలను ఎలా ఆపగలిగాడు? అసలు ఆ మ్యూజిక్ టీచర కథేంటి? చివరకు ఏమైంది? అన్నది తెలుసుకోవలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఊహించని ట్విస్టులతో సాగే ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు శబ్దం. టైటిల్ కు తగ్గట్టుగానే ‘సౌండ్’ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఆది పినిశెట్టి హీరోగా నటించాడు. సీనియర్ హీరోయిన్లు సిమ్రాన్, లైలా ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించడం విశేషం. అలాగే రెడిన్ కింగ్ స్లే, ఎంఎస్ భాస్కర్, రాజీవ్ మేనర్, వివేక్ ప్రసన్న, టీఎస్సార్ శ్రీనివాసన్ తదితరులు ఈ మూవీలో మెరిశారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళంతో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..