అధికారిక ప్రకటన.. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ

టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబోలో సినిమా రాబోతోంది.‌ సెన్సేషనల్ హీరో విజయ్‌ దేవరకొండ మరో అద్భుత అవకాశం సొంతం చేసుకున్నారు

అధికారిక ప్రకటన.. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ

Edited By:

Updated on: Sep 28, 2020 | 11:53 AM

Vijay Deverakonda Sukumar: టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబోలో సినిమా రాబోతోంది.‌ సెన్సేషనల్ హీరో విజయ్‌ దేవరకొండ మరో అద్భుత అవకాశం సొంతం చేసుకున్నారు. లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో విజయ్ నటించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఫాల్క‌న్ క్రియేష‌న్స్ ప‌తాకంపై  కేదార్ సెల‌గంశెట్టి ఈ మూవీ ద్వారా నిర్మాతగా పరిచయం కాబోతున్నారు. ఇవాళ కేదార్ పుట్టినరోజు సందర్భంగా ఆ ప్రకటనను వెల్లడించిన ఆయన ఇది తనకు చాలా ప్రత్యేకమైన రోజు అని అన్నారు.

తనకు ఎంతో ఇష్టమైన విజయ్ దేవరకొండ, సుకుమార్‌లతో మొదటి సినిమాను ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉందని, 2022లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుందని తెలిపారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా ఉండబోతుందని, దీనికి సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామని కేదార్ తెలిపారు.

ఇక మరోవైపు ఈ ప్రాజెక్ట్‌పై విజయ్ దేవరకొండ ట్వీట్ చేస్తూ.. నాలో ఉన్న నటుడు ఉత్సాహంతో ఉన్నాడు. నాలో ఉన్న ప్రేక్షకుడు సంబరాలు చేసుకుంటున్నాడు. ఇది కచ్చితంగా గుర్తుండిపోయే చిత్రం అవుతుందని హామీ ఇస్తున్నా. ఎప్పుడెప్పుడు సుక్కు సర్‌తో సెట్స్ మీదకు వెళ్తాను అని ఎదురుచూస్తున్నా. హ్యాపీ బర్త్‌డే కేదార్‌. నువ్వు నాకొక మంచి స్నేహితుడివి, చాలా కష్టపడతావు. ఇది నీకు మా గిఫ్ట్‌ అని కామెంట్ పెట్టారు. కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు సుకుమార్ అల్లు అర్జున్‌తో పుష్పను తెరకెక్కించే పనిలో ఉన్నారు.

Read More:

‘నిశ్శబ్దం’లో బిగ్‌ ట్విస్ట్ అతడేనా..!

Corona India Updates: దేశంలో 60 లక్షలు దాటేసిన కేసుల సంఖ్య