బర్త్‌డే: మరో సినిమాను ప్రకటించిన బన్నీ

| Edited By: Anil kumar poka

Apr 08, 2019 | 12:27 PM

‘నా పేరు సూర్య’ తరువాత ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. వరుస సినిమాలతో మళ్లీ బిజీ అవ్వబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు సినిమాలను ఒప్పుకున్న బన్నీ.. తాజాగా మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ‘ఓ మై ఫ్రెండ్’, ‘ఎమ్‌సీఏ’ ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో బన్నీ ఓ చిత్రంలో నటించబోతున్నాడు. ‘ఐకాన్’(కనబడుట లేదు క్యాప్షన్) అనే టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ కూడా విడుదలైంది. దిల్ […]

బర్త్‌డే: మరో సినిమాను ప్రకటించిన బన్నీ
Follow us on

‘నా పేరు సూర్య’ తరువాత ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. వరుస సినిమాలతో మళ్లీ బిజీ అవ్వబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు సినిమాలను ఒప్పుకున్న బన్నీ.. తాజాగా మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ‘ఓ మై ఫ్రెండ్’, ‘ఎమ్‌సీఏ’ ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో బన్నీ ఓ చిత్రంలో నటించబోతున్నాడు. ‘ఐకాన్’(కనబడుట లేదు క్యాప్షన్) అనే టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ కూడా విడుదలైంది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ చిత్ర పోస్టర్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

కాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 19వ సినిమాలో, సుకుమార్ దర్శకత్వంలో 20వ చిత్రంలో బన్నీ నటించనున్నాడు. వీటిలో ముందుగా త్రివిక్రమ్‌ సినిమాలో భాగం కానున్నాడు బన్నీ. హారిక అండ్ హాసిని నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదికే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అలాగే సుకుమార్‌ సినిమా ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.