అదరగొట్టిన “ఎన్టీఆర్ మహానాయకుడు” ట్రైలర్

| Edited By: Ram Naramaneni

Oct 18, 2020 | 9:27 PM

భారీ అంచనాల మధ్య విడుదలైన “ఎన్టిఆర్ మహానాయకుడు” ట్రైలర్ అదరగొట్టింది. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సన్నివేశాలను ఇందులో ఆసక్తికరంగా చూపించారు. పార్టీ స్థాపన, రాజకీయ మలుపులు, ప్రజల మధ్య ఎన్టిఆర్ జీవితం వంటి కీలక అంశాలను రక్తి కట్టించారు. ఎన్టీఆర్‌కు ప్రజలు బ్రహ్మరధం పట్టడం, ఒక మహానాయకుడిగా ఎదిగిన విధానాన్ని కళ్లకు కట్టారు. తెలుగునాట మహానాయకుడిగా అందరి మదిలో గుర్తిండిపోయిన ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్‌ను చిత్రిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని రెండు భాగాలుగా విడుదల […]

అదరగొట్టిన ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్
Follow us on

భారీ అంచనాల మధ్య విడుదలైన “ఎన్టిఆర్ మహానాయకుడు” ట్రైలర్ అదరగొట్టింది. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సన్నివేశాలను ఇందులో ఆసక్తికరంగా చూపించారు. పార్టీ స్థాపన, రాజకీయ మలుపులు, ప్రజల మధ్య ఎన్టిఆర్ జీవితం వంటి కీలక అంశాలను రక్తి కట్టించారు. ఎన్టీఆర్‌కు ప్రజలు బ్రహ్మరధం పట్టడం, ఒక మహానాయకుడిగా ఎదిగిన విధానాన్ని కళ్లకు కట్టారు.

తెలుగునాట మహానాయకుడిగా అందరి మదిలో గుర్తిండిపోయిన ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్‌ను చిత్రిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు పేరుతో విడుదలై ప్రేక్షకులను అలరించింది. అందులో ఎక్కువగా ఎన్టీఆర్ సినిమా రంగానికి సంబంధించిన చరిత్రను ప్రముఖంగా చూపించారు.

అయితే ఎన్టీఆర్ మహానాయకుడు పేరుతో విడుదల కాబోతున్న రెండో భాగంలో రాజకీయ జీవితాన్ని చూపించారు. ఈ రెండు భాగాలకు క్రిష్ దర్శకత్వం వహించగా ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ నిర్మాణ బాధ్యతలను స్వయంగా నిర్వహించారు. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య చక్కగా ఒదిగిపోయారు. అచ్చం ఎన్టీఆర్‌లా మైమరిపించారు. ఫిబ్రవరి 22న ఈ రెండో భాగం విడుదలకు సిద్ధంగా ఉంది.