టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహానటి ఫేమ్ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు చిత్రయూనిట్. మరోవైపు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ‘చెక్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది.
ఈ రెండు సినిమా లతో పాటు బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘అంధధున్’ను సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాను మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్నాడు. ఇలా వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్న నితిన్ ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. పొలిటికల్ డ్రామాలో నితిన్ ఓ సినిమా చేయబోతున్నాడని టాక్. ఏలూరు రాజకీయ నేపథ్యంలో ఈ కథ సాగుతుందని, ఈ సినిమాకు ‘పవర్ పేట’ టైటిల్ ను కూడా ఖరారు చేసారని వార్తలు వస్తున్నాయి. మరో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ సినిమాలో నితిన్ 60 ఏళ్ల వృద్ధుడిగా కనిపించనున్నాడట. తొలి షెడ్యూల్లో ఈ ఓల్డ్ మెన్ గెటప్కు సంబంధించిన సన్నివేశాలను షూట్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో కృష్ణ చైతన్య , నితిన్ కాంబోలో ‘చల్ మోహన్ రంగ’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే..
మరిన్ని ఇక్కడ చదవండి :
Rashi Khanna: ప్రకృతిలో ఒడిలో అందాల తార వర్కవుట్ వీడియో.. వైరల్‌గా మారిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్..