Nikhil siddharth: కార్తికేయ 3పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నిఖిల్‌.. ఒకవేళ ఈ సినిమా చేయకపోతే..

హ్యాపీడేస్‌లో మూవీలో రాజేశ్‌ పాత్రలో యూత్‌ను తెగ ఆకట్టుకున్న నిఖిల్‌.. ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నాడు. స్వామి రారా, కార్తికేయ, కేశవ, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నాడు. తాజాగా కార్తికేయ..

Nikhil siddharth: కార్తికేయ 3పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నిఖిల్‌.. ఒకవేళ ఈ సినిమా చేయకపోతే..
Nikhil About Karthikeya 3

Updated on: Oct 17, 2022 | 6:45 AM

హ్యాపీడేస్‌లో మూవీలో రాజేశ్‌ పాత్రలో యూత్‌ను తెగ ఆకట్టుకున్న నిఖిల్‌.. ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నాడు. స్వామి రారా, కార్తికేయ, కేశవ, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నాడు. తాజాగా కార్తికేయ 2 చిత్రంతో ఒక్కసారిగా దేశం దృష్టిని తనవైపు ఆకర్షించాడు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక కార్తికేయ 2 భారీ విషయాన్ని అందుకుందో లేదో కార్తికేయ పార్ట్‌3పై వార్తలు మొదలయ్యాయి. సినిమా ఎండింగ్‌లో పార్ట్‌ 3 ఉంటుందని దర్శకుడు చెప్పకనే చెప్పడంతో అప్పుడే క్యూరియాసిటీ మొదలైంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంగ్లిష్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిఖిల్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది. కార్తికేయ సీక్వెల్‌పై స్పందించిన నిఖిల్‌.. ‘కార్తికేయ సినిమా తీస్తున్నప్పుడు దానికి సీక్వెల్‌ అనుకోలేదు. కానీ.. నేను ఎక్కడికి వెళ్లినా ‘కార్తికేయ2’ ఎప్పుడు తీస్తారు’ అని అడిగే వాళ్లు. ప్రేక్షకులు ఆ సినిమాను అంతగా కోరుకున్నారు. ఇప్పుడు కార్తికేయ-3 గురించి కూడా అలానే అడుగుతున్నారు. ఈ సినిమా అతి తర్వలోనే ప్రారంభం కానుంది’ అని చెప్పుకొచ్చాడు. ఒక తాను కార్తికేయ-3 చేయకపోతే అభిమానులు ఏమంటారో తెలియదు కానీ… మా అమ్మ మాత్రం నన్ను వదలదు అంటూ చమత్కరించాడు నిఖిలు.

ఇక ట్రిపులార్‌ మూవీ ఆస్కార్‌ ఎంట్రీకి సంబంధించి నిఖిల్‌ మరోసారి స్పందించాడు. ట్రిపులార్‌, కశ్మీర్‌ ఫైల్స్‌ తనకు ఎంతగానో నచ్చాయన్న నిఖిల్‌ ఆ చిత్రాలకు ఆస్కార్ అవార్డ్‌ వస్తే సంతోషమేనని, అయితే అదే ముఖ్యమైందని కాదన్నారు. ప్రేక్షకుల ప్రేమాభిమానాలు అవార్డుల కంటే గొప్పవని నిఖిల్‌ అభివర్ణించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us