రాహుల్ విజయ్, నిహారిక కొణిదెల జంటగా ప్రణీత్ బ్రామ్మడపల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సూర్యకాంతం’. ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నిహారిక.. అభిమానులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబులు ఇచ్చింది.
డేటింగ్ చేయాల్సి వస్తే.. ఓపికగా వినే వ్యక్తి ని మాత్రమే తాను ఎంచుకుంటానని.. ఎందుకంటే తానెప్పుడూ ఎక్కువగా మాట్లాడుతానని నవ్వుతూ సమాధానం ఇచ్చింది నిహారిక. ఇక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత సందీప్ ఎర్రమరెడ్డి నిర్మిస్తుండగా రాబిన్ మార్క్ సంగీతం అందిస్తున్నాడు.