AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లీలా మాహల్.. మల్టీప్లెక్స్‌కే సవాల్ విసురుతున్న సింగల్ స్క్రీన్ థియేటర్.. లోపల మామూలుగా లేదుగా..

మల్టీప్లెక్స్‌ల హవా కొనసాగుతున్న ఈ రోజుల్లో నెల్లూరులోని ప్రముఖ లీలా మహల్ థియేటర్ కొత్త రూపంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకప్పుడు 400కుపైగా సీట్లు ఉన్న ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్‌ను అత్యాధునిక సదుపాయాలతో పునర్నిర్మించారు. పూర్తి స్థాయిలో రెక్లైనర్ సీట్లు, అత్యుత్తమ సౌండ్ సిస్టమ్, ఆకర్షణీయమైన ఇంటీరియర్‌తో మల్టీప్లెక్స్‌లకు ఏమాత్రం తీసిపోని అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తోంది. సింగిల్ స్క్రీన్లు కనుమరుగవుతున్న సమయంలో లీలా మహల్ కొత్త అవతారం సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

లీలా మాహల్.. మల్టీప్లెక్స్‌కే సవాల్ విసురుతున్న సింగల్ స్క్రీన్ థియేటర్.. లోపల మామూలుగా లేదుగా..
Nellore Leela Mahal Theatre
Ch Murali
| Edited By: |

Updated on: Jun 02, 2026 | 11:26 AM

Share

ఆ జిల్లా రాజకీయాలకే కాదు సినిమాలకు కూడా స్పెషలే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కొత్త సినిమా రిలీజ్ అయింది అంటే చాలు.. ఆ సినిమా హిట్ అయిందా? ఫ్లాప్ అయిందా..? తెలుసుకోవాలనుకుంటే నిర్మాతల దగ్గర నుంచి హీరోల వరకు మొదటగా టాక్ తెలుసుకునేది ఆ జిల్లాలోని.. ఆ జిల్లాలో సినిమా హిట్ అయింది అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో హిట్ అయినట్టే.. అంతలా ప్రభావం చూపిస్తుంది ఆ జిల్లా.. అలాగే మల్టీప్లెక్స్ లకి పెట్టింది పేరు ఈ జిల్లానే అలాంటి ఈ జిల్లాలో ఒక సింగల్ స్క్రీన్ నేడు మల్టీప్లెక్స్ థియేటర్లకు సవాల్ గా మారింది. సింగల్ స్క్రీన్లు కనుమరుగై కళ్యాణ మండపాలు రైస్ మిల్లులుగా రూపుదిద్దుకుంటుంటే ఆ ఒక్క సింగల్ స్క్రీన్ మాత్రం మల్టీప్లెక్స్ థియేటర్లకు సవాల్ విసూరుతుంది. ఇంతకీ ఆ జిల్లా ఏది ఆ సింగల్ స్క్రీన్ ఎక్కడ ఉంది.. అనే వివరాలు తెలుసుకోవాలనుకుంటే.. ఈ కథనం చదవాల్సిందే..

సినిమా రంగానికి నెల్లూరుకు మంచి సంబంధం ఉంది.. సినిమా హిట్ అయిందా తెలుసుకోవాలంటే.. మొదటగా నెల్లూరు వాసుల్ని అడిగి తెలుసుకుంటారు. ఇప్పటికే అదే తరహా ఆలోచన విధానం కొనసాగుతుంది. నెల్లూరు జిల్లాలో తో పాటు రాష్ట్రవ్యాప్తంగా మల్టీప్లెక్స్ ప్రాబల్యంతో సింగిల్ స్క్రీన్లు కనుమరుగయ్యాయి. ఒకప్పుడు మూడు అంకెల స్థాయిలో సింగిల్ స్క్రీన్ లు ఉండేవి.. అయితే నేడు రెండు అంకెలలోపే ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో సింగల్ స్క్రీన్లు మెయింటినెన్స్ చేయలేక కళ్యాణ మండపాలు రైస్ మిల్లులుగా తీర్చిదిద్దారు. కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం లీలా మహల్ అనే ఒక సింగల్ స్క్రీన్ ధియేటర్ ని నేడు మల్టీప్లెక్స్ లు తలదన్నేలా తీర్చిదిద్ది నెల్లూరు వాసులను ఔరా అనిపిస్తోంది.

వీడియో చూడండి..

ప్రతి జిల్లాకి ఒక సెంటర్ ఫేమస్ అలాగే నెల్లూరు నగరానికి లీలామహల్ ఎంతో ఫేమస్.. అలాంటి లీలా మహల్ నేడు అత్యాధునిక వసతులు సీట్లతో మల్టీప్లెక్స్ లను మించి రూపుదిద్దుకుంది. హాలు మొత్తం రెక్లైనింగ్ సీట్లతో అత్యద్భుతమైన ఇంటీరియర్ సౌండ్ సిస్టంతో ఔరా అనిపిస్తుంది. గతంలో 400 సీట్లు పైగా ఉన్న ఈ లీలా మహల్ లో నేడు రెక్లైనర్ సీట్లు ఏర్పాటు చేయడంతో 200 కి చేరింది.. ఇంట్లో ప్రశాంతంగా పడుకుని టీవీ చూస్తున్నట్లు ఇక్కడ పడుకుని సినిమా చేసేలా సీట్లు ఏర్పాటు చేయడం విశేషం.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us