Nayanthara-Vignesh Shivan: నయన్‌, విఘ్నేశ్‌లు ఏడడుగులు నడిచారా?.. అనుమానాలు రేకేత్తిస్తోన్న వైరల్ వీడియో..

|

Mar 14, 2022 | 9:05 AM

కోలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ నయనతార (Nayanthara), విఘ్నశ్‌ శివన్‌లకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారుతోంది. నాను రౌడీదాన్‌ (తెలుగులో నేనూ రౌడీనే) సినిమా షూటింగ్‌ సమయంలో మొదటిసారి కలుసుకున్న నయన్‌, విఘ్నేశ్‌ (Vignesh Shivan)

Nayanthara-Vignesh Shivan: నయన్‌, విఘ్నేశ్‌లు ఏడడుగులు నడిచారా?.. అనుమానాలు రేకేత్తిస్తోన్న వైరల్ వీడియో..
Nayanatara
Follow us on

కోలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ నయనతార (Nayanthara), విఘ్నశ్‌ శివన్‌లకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారుతోంది. నాను రౌడీదాన్‌ (తెలుగులో నేనూ రౌడీనే) సినిమా షూటింగ్‌ సమయంలో మొదటిసారి కలుసుకున్న నయన్‌, విఘ్నేశ్‌ (Vignesh Shivan)లు అప్పటి నుంచే ప్రేమలో మునిగితేలుతున్నారు. వెకేషన్‌లు, పార్టీలు, సినిమా ఈవెంట్లు..ఎక్కడికెళ్లినా జంటగానే కనిపిస్తున్నారు. కాగా డేటింగ్‌ లో ఉన్న ఈ ప్రేమ పక్షులు లాక్‌డౌన్‌లో సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్నాయన్న వార్తలు కూడా వచ్చాయి. ఈక్రమంలో పెళ్లెప్పుడు అని అడగ్గా లాక్‌డౌన్‌ అనంతరం ఘనంగా ఏడడుగులు నడుస్తామని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే నయన్‌-విఘ్నేష్‌లకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వారంత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా? అంటూ నోరెళ్లబెడుతున్నారు

కాగా లాక్‌డౌన్‌ ఎత్తివేసినప్పటి నుంచి నయన్‌, విఘ్నేశ్‌లు దేశంలోని ప్రముఖ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తోందన్న సంగతి తెలిసిందే. అలా తాజాగా తమిళనాడులోని ఓ అమ్మావారి దేవస్థానానికి వెళ్లారు. దీంతో అభిమానులు తమ సెల్‌ఫోన్‌ కెమెరాలకు పనిచెప్పారు. వీరి ఫోటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఓ ఫ్యాన్ తీసిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఎందుకంటే అందులో నయనతార నుదుటిపై కుంకుమ(సింధూరం) పెట్టుకుని కనిపించింది. అది చూసిన నెటిజన్లు నయనతారకు, విఘ్నేశ్‌లు ఏడడుగులు నడిచారని, అయితే బయటికి చెప్పడం లేదంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే తమిళనాడులోని అమ్మవారి దేవాలయాలను సందర్శించే సందర్భాల్లో అమ్మాయిలు నుదుటిపై కుంకుమ పెట్టుకోవడం సంప్రదాయమని.. అందుకే నయన్‌ నుదుటిపై సింధూరం ధరించిందని మరికొందరు నెటిజన్లు చెబుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం నయనతార కాతువాక్కుల రెండు కాదల్‌ మూవీతో బిజీగా ఉంది. విఘ్నేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ ట్రైయాంగిల్‌ లవ్‌స్టోరీలో నయన్‌తో పాటు సమంత, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్‌ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read:Viral Photo: ఈ ఫొటోలో ముఖ్యమంత్రి ఉన్నారు.. యూత్ ఐకానిక్ ఈయనే.. గుర్తుపడితే మీరు జీనియస్..

Vijayawada: బెజవాడలో దారుణం.. హోటల్‌కు తీసుకెళ్లి భార్యను చంపిన భర్త

Telangana: మంత్రి కావాలన్న ఆయన కల కలేనా..? సీఎం కేసీఆర్ అనూహ్య నిర్ణయంతో శాస‌న మండ‌లి చైర్మన్‌గా మళ్లీ..