ఆ అవార్డుతో నయన్‌ పెళ్లి లింక్‌.. గెలుచుకున్న తరువాతే వివాహం..!

వరుస సినిమాలు, విజయాలతో దక్షిణాది లేడి సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్నారు నయనతార. 2003లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నయనతార..

ఆ అవార్డుతో నయన్‌ పెళ్లి లింక్‌.. గెలుచుకున్న తరువాతే వివాహం..!

Edited By:

Updated on: Oct 06, 2020 | 11:54 AM

Nayanthara marriage news: వరుస సినిమాలు, విజయాలతో దక్షిణాది లేడి సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్నారు నయనతార. 2003లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నయనతార.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 70కి పైగా చిత్రాల్లో నటించారు. ఎంతమంది కొత్త హీరోయిన్లు వచ్చినా ఆమె క్రేజ్ తగ్గకపోగా.. ఇప్పటికీ నయన్‌ చేతినిండా సినిమాలు ఉన్నాయి. అంతేకాదు రెమ్యునరేషన్‌లో ఆమె దక్షిణాది హీరోయిన్‌లలో టాప్‌లో ఉన్నారు.

ఇది పక్కన పెడితే వ్యక్తిగత జీవితంలో గత కొన్నేళ్లుగా దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో రిలేషన్‌లో ఉన్నారు నయన్‌. 2015లో నానుమ్‌ రౌడీదాన్ సినిమా షూటింగ్‌లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించగా.. ఇప్పటికీ కొనసాగుతోంది. ఎన్నోసార్లు వీరిద్దరు తమ ప్రేమను బహిరంగంగానే వ్యక్తపరిచారు. అయితే ఇన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న  ఈ ఇద్దరు.. పెళ్లి గురించి మాత్రం ఆలోచించడం లేదు. ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విఘ్నేష్‌ శివన్‌.. తామిద్దరికి కొన్ని కోరికలు ఉన్నాయని, అవి నెరవేర్చుకునే వరకు పెళ్లి చేసుకోమని స్పష్టం చేశారు. అయితే ఆ కోరికలను మాత్రం ఆయన బయటపెట్టలేదు.

ఇదిలా ఉంటే నయన్‌ పెళ్లి గురించిన ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే జాతీయ అవార్డును సొంతం చేసుకున్న తరువాతే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో నయనతార ఉందట. ఆమె నటనకు పలు అవార్డులు లభించినప్పటికీ, ఇంతవరకు జాతీయ అవార్డు రాలేదు. అరమ్‌(తెలుగులో కర్తవ్యం)లో నయన్ కలెక్టర్ పాత్రకు గానూ జాతీయ అవార్డు వస్తుందని అభిమానులు భావించారు. కానీ రాలేదు. మరి ఇందులో నిజమెంతో తెలీదు గానీ నయన్‌కి జాతీయ అవార్డు రావడం వస్తే మాత్రం దక్షిణాది సినిమా ఇండస్ట్రీ మొత్తం హ్యాపీగా ఫీల్‌ అవుతుంది.

Read More:

RRR: ప్రారంభమైన ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్.. 22న ఎన్టీఆర్ టీజర్‌

షూటింగ్‌ స్టార్ట్‌ చేసిన నాని..!