AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఊరిలో తల లేని శవం.. ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్

ప్రస్తుతం సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ సినిమాలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఓటీటీలో ఈ జానర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు టాప్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ గురించే.

OTT Movie: ఊరిలో తల లేని శవం.. ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
OTT Movie
Basha Shek
|

Updated on: Oct 20, 2026 | 5:58 PM

Share

‘సేనాపతి’, ‘మాయాబజార్ ఫర్ సేల్’, ‘గుర్రం పాపిరెడ్డి’, ‘వికటకవి’, ‘పరువు’ లాంటి సినిమాలు, వెబ్ సిరీస్ లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నరేశ్ అగస్త్య. ముఖ్యంగా ఈ మధ్యన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీసుల్లో ఎక్కువగా నటిస్తున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఆడియెన్స్ కూడా ఈ నటుడి సినిమాలు, సిరీస్ లను తెగ చూసేస్తున్నారు. అలా ఓటీటీ ఆడియెన్స్ కోసం మరో ఇంట్రెస్టింగ్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ తో మన ముందుకు వచ్చాడు నరేష్ ఆగస్త్య. అదే రుద్రవరం పీఎస్. శశిధర్ మున్నంగి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ అందర దృష్టిని ఆకర్షిస్తోంది. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లో ఎస్ఐ శివకుమార్‌గా పవర్‌ఫుల్ అండ్ ఇంటెన్స్ రోల్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ 30 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘రుద్రవరం పీఎస్’ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సుమారు 1.42 నిమిషాల పాటు ఉన్న ఈ సిరీస్ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింద. ఇందులోని సన్నివేశాలు కూడా ఉత్కంఠ రేపేలా ఉన్నాయి. అలాగే ‘క్రైమ్ ను ఫాలో అయితే జరిగింది మాత్రమే తెలుస్తుంది. అదే క్రిమినల్ ను ఫాలో అయితే జరగబోయేది కూడా తెలుస్తుంది’ అన్న డైలాగులు సిరీస్ పై ఇంట్రెస్ట్ ను పెంచేస్తున్నాయి.

‘రుద్రవరం పీఎస్’  స్టోరీ ఏంటంటే?

ఈ కథ అంతా ‘రుద్రవనం’ అనే ఒక మారుమూల గ్రామం, అక్కడి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. ఆ ఊరిలో ఒక వ్యక్తి హఠాత్తుగా అదృశ్యమవుతాడు. అదే సమయంలో ఎవరిదో తెలియని ఒక ‘తల లేని మొండెం’ లభ్యమవుతుంది. ఈ కేసును ఛేదించే బాధ్యతను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన ఎస్ఐ శివకుమార్ కు అప్పగిస్తారు. అయితే విచారణలో ఆ ఊరిలో పలు మిస్టరీ సీక్రెట్స్ వెలుగులోకి వస్తాయి. స్థానిక రాజకీయాలు, అవినీతి నెట్‌వర్క్, ఎన్నో ఏళ్లుగా పూడ్చిపెట్టిన రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. మరి ఆ తల లేని మొండెం ఎవరిది? మాయమైన వ్యక్తికి, ఈ మర్డర్‌కి ఉన్న లింక్ ఏంటి? అసలు ఆ ఊరి పెద్దలు దాస్తున్న సీక్రెట్స్ ఏంటి? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

‘రుద్రవరం పీఎస్’ వెబ్ సిరీస్ ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఊరిలో తల లేని శవం.. ఓటీటీలో మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
ఊరిలో తల లేని శవం.. ఓటీటీలో మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
మరణం గురించి సందేశం ఇస్తున్న ఫాదర్‌.. కూలిన భారీ శిలువ
మరణం గురించి సందేశం ఇస్తున్న ఫాదర్‌.. కూలిన భారీ శిలువ
ISRO శ్రీహరికోటలో 97 ఉద్యోగాలు.. రూ.1.42 లక్షల వరకు జీతం..
ISRO శ్రీహరికోటలో 97 ఉద్యోగాలు.. రూ.1.42 లక్షల వరకు జీతం..
దసరా నాడు పాలపిట్ట దర్శనం ఎందుకు చేసుకోవాలో తెలుసా?
దసరా నాడు పాలపిట్ట దర్శనం ఎందుకు చేసుకోవాలో తెలుసా?
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారా..? పండక్కి ముందే శుభవార్త..
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారా..? పండక్కి ముందే శుభవార్త..
APPSC లెజిస్లేచర్ సర్వీసెస్‌లో రిపోర్టర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
APPSC లెజిస్లేచర్ సర్వీసెస్‌లో రిపోర్టర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
భైంసా వెనుక దాగున్న మిస్టరీ గురించి మీకు తెలుసా?
భైంసా వెనుక దాగున్న మిస్టరీ గురించి మీకు తెలుసా?
క్యాచ్ మిస్ చేసిన షెఫాలీ వర్మ.. ఊహించని షాకిచ్చిన ఐసీసీ..!
క్యాచ్ మిస్ చేసిన షెఫాలీ వర్మ.. ఊహించని షాకిచ్చిన ఐసీసీ..!
కొత్త టెస్లా కారు కొన్న రాహుల్ సిప్లిగంజ్.. ధర ఎంతో తెలుసా?
కొత్త టెస్లా కారు కొన్న రాహుల్ సిప్లిగంజ్.. ధర ఎంతో తెలుసా?
దసరా తర్వాతి రోజు కూడా బ్యాంకులు మూసివేసి ఉంటాయా..? క్లారిటీ ఇదే.
దసరా తర్వాతి రోజు కూడా బ్యాంకులు మూసివేసి ఉంటాయా..? క్లారిటీ ఇదే.